Movie News

తారక్ లేడు…హృతిక్ నిరాశ పరిచాడు

ఇవాళ విడుదలైన టైగర్ 3 స్పెషల్ క్యామియోల మీద గత వారం రోజులుగా భారీ ప్రచారం జరిగింది. షారుఖ్ ఖాన్ గురించి ముందే తెలిసింది కాబట్టి కనిపించిన ఆ కాసేపు ఇద్దరి హీరోల అభిమానులు ఎంజాయ్ చేశారు. అయితే చివరిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తాడని, వార్ 2కి సంబంధించిన కీలక లీడ్ ఇస్తారని బాలీవుడ్ మీడియా తెగ ఊదరగొట్టింది. ఇదంతా పబ్లిసిటీలో భాగమేనని, తారక్ లేని విషయాన్ని మనోళ్లు ముందే పసిగట్టారు. దీన్ని నిజం చేస్తూ టైగర్ 3 ఎండ్ టైటిల్స్ అయిపోయాక కేవలం హృతిక్ రోషన్ కొన్ని సెకండ్లు మాత్రమే కనిపించే షాట్ తో మమ అనిపించారు.

దీంతో ఏదేదో ఊహించుకున్న ఫ్యాన్స్ నిరాశ చెందారు. వార్ 2లో హృతిక్ పోషించిన పాత్ర పేరు కబీర్. అది మొదటి భాగంలో ఓ రేంజ్ లో పేలింది. దానికి సరైన బిల్డప్ సెట్ చేసుకోవాలి. కానీ టైగర్ 3లో ఏదో మొక్కుబడిగా ఒక సన్నివేశం రాసుకుని, అశుతోష్ రానాతో చిన్న ఎలివేషన్ డైలాగు చెప్పించి, ఓ రౌడీ గుంపుని నరికించి మేనేజ్ చేశారు. అయితే కీలక ట్విస్టు ఒకటి ఇచ్చారు. కరుడు గట్టిన సైతాన్ కంటే ప్రమాదకరమైన వాడు ఒకడు వచ్చాడని, వాడితో తలపడాలంటే అంతకన్నా దారుణంగా మారిపోవాలని కబీర్ కి రా ఛీఫ్ సూచించడం ఒక ముఖ్యమైన క్లూ ఇచ్చినట్టే ఉంది.

అది జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించేనని ఇన్ సైడ్ టాక్. కానీ వర్ణించిన తీరు చూస్తేనేమో విలన్ తరహాలో ఉంది. మరి తారక్ అక్కడి డెబ్యూకి ఇలాంటి కథను ఎంచుకుంటాడా అంటే చెప్పలేం. ఒకవేళ దీనికి బదులు హృతిక్, తారక్ లు పరస్పరం కలుసుకునే చిన్న ఫ్రేమ్ ఉన్నా చాలు థియేటర్లు దద్దరిల్లిపోయేవి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న వార్ 2 ని 2025 జనవరిలో విడుదల చేసేందుకు యష్ ఫిలింస్ ప్లాన్ చేస్తోంది. స్పై యునివర్స్ లో భాగంగా ఇకపై తారక్ కూడా రెగ్యులర్ గా ఈ సిరీస్ లో నటించే అవకాశముంది. అది వార్ 2 బ్లాక్ బస్టర్ కావడం మీద ఆధారపడి ఉంటుంది.

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

5 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

6 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

6 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

6 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

8 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

9 hours ago