జైలర్ ఇండస్ట్రీ హిట్ తో ఫుల్ జోష్ లోకి వచ్చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరు నెలలు తిరక్కుండానే సంక్రాంతికి లాల్ సలాంతో రాబోతున్నారు. ఇందులో ఆయన ఫుల్ లెన్త్ హీరో కాకపోయినా కాస్త ఎక్కువ నిడివి ఉన్న క్యామియో కావడంతో బిజినెస్ కూడా ఆ కోణంలోనే భారీగా జరుగుతోంది. రజని కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. విష్ణు విశాల్ ప్రధాన పాత్ర పోషించగా ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చడం అంచనాలు పెంచుతోంది. ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా టీజర్ రిలీజ్ చేశారు. కాన్సెప్ట్ ఏంటో స్పష్టంగా రివీల్ చేశారు.
అదో చిన్న ఊరు. అక్కడ రెండు మతాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. క్రికెట్ పోటీ జరిగితే ఇరు వర్గాలు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ రేంజ్ లో గ్రౌండ్ కి వచ్చి భావోద్వేగాలను బయట పెట్టుకుంటాయి. అయితే ఓ సంఘటన ఈ గ్రామం తలరాతను మారుస్తుంది. కొట్టుకోవడంతో మొదలై రక్తం చిందే హత్యల దాకా వెళ్తుంది. ధనవంతుడైన ఓ పెద్దమనిషి(రజనీకాంత్) ఇదంతా చూసి కలత చెందుతాడు. పరిష్కారానికి పూనుకుంటాడు. అదంత సులభంగా ఉండదు. దీంట్లో కీలకంగా వ్యవహరించిన ఓ కుర్రాడి(విష్ణు విశాల్)కి ఈ సంఘటనకి సంబంధం ఏంటనేది సినిమాలో చూడాలి.
టేకింగ్ పరంగా ఐశ్వర్య అనుభవమున్న దర్శకురాలిగా తీసినట్టు విజువల్స్ లో కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ ని ఎలివేట్ చేసింది. ముస్లిం పెద్ద గెటప్ లో రజినీకాంత ఆహార్యం డిఫరెంట్ గా ఉంది. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో హెవీ ఎమోషన్స్ మీద కథను నడిపించినట్టు అర్థమవుతోంది. విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబీ రామయ్య, వివేక్ ప్రసన్న ఇలా క్యాస్టింగ్ మొత్తం తమిళ బ్యాచే ఉంది. పొంగల్ రిలీజ్ అని మరోసారి స్పష్టం చేశారు కాబట్టి లాల్ సలామ్ ఈసారి పండక్కు అయిదారు స్ట్రెయిట్ తెలుగు సినిమాలను ఢీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. డేట్ ఇవ్వలేదు.
This post was last modified on November 12, 2023 1:58 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…