‘స్పార్క్ లైఫ్’ వంటి భారీ బడ్జెట్ చిత్రంతో విక్రాంత్ వంటి యంగ్ హీరో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతోన్నారు. విక్రాంత్ ఈ సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా కథకుడు, స్క్రీన్ ప్లే రైటర్, దర్శకుడిగానూ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు.
డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ మీద రాబోతోన్న ఈ చిత్రంలో మెహరీన్, రుక్సర్ థిల్లాన్‌లు హీరోయిన్లుగా నటించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఐదు భాషల్లో ఈ చిత్రం నవంబర్ 17న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా శనివారం నాడు ఈ చిత్రం నుంచి ఈవిల్ సైడ్ అఫ్ స్పార్క్ లైఫ్ పేరుతో స్నీక్ పీక్‌ను రిలీజ్ చేశారు.ఈ మేరకు ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో
విక్రాంత్ మాట్లాడుతూ.. ‘చంద్రమోహన్ గారి మరణం చాలా బాధాకరం. ఎన్నో గొప్ప పాత్రలను పోషించారు. ఆయన లేని లోటు తీరనది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఇంత వరకు మేం స్పార్క్ నుంచి ప్రేమను చూపించాం.. యాక్షన్ చూపించాం.. ఇన్వెస్టిగేషన్ చూపించాం. కానీ ఇంత వరకు చూపించకుండా ఓ సర్ ప్రైజ్‌ను దాచి ఉంచాం. లైఫ్ (L.I.F.E) అనేది స్పార్క్ క్యాప్షన్. లవ్, క్రైమ్, యాక్షన్ చూపించాం. ఇప్పుడు ఈవిల్‌ను చూపించాం. మెహరీన్, రుక్సర్ ఈ సినిమాకు వంద శాతం న్యాయం చేశారు.
నేను ఇండియాకు వచ్చి సినిమా తీస్తాను అంటే.. డబ్బులు పోగొట్టుకుంటావ్ అని అందరూ అన్నారు. కానీ మంచి చిత్రం తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది. ఈ ప్రయాణంలో నన్ను ఒక్కరు ప్రోత్సహిస్తే.. 99 మంది నిరుత్సాహపరిచారు. వారంతా కూడా నా మీదున్న ప్రేమతోనే అన్నారు. కానీ తలదించుకుని పని చేశాను. వారంతా నాలోని ఫైర్‌ను ఇంకా రగిల్చినట్టుగా అనిపించింది. ఎంకరేజ్ చేసిన వారికి, విమర్శించిన వారికి నేను థాంక్స్ చెబుతాను. నవంబర్ 17న తలెత్తే అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇస్తాడని ఆశిస్తున్నాను.
ప్రతీ ఒక్క ఫ్రేమ్, షాట్‌ను ఎంతో డీటైలింగ్‌గా తీశాం. నచ్చకపోతే రీ షూట్లు కూడా చేశాం. ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేసే పిల్లాడిలా మేం ఎదురుచూస్తున్నాం. మేం తీసిన సినిమా మాకు బాగానే ఉంటుంది. కానీ ప్రేక్షకులకు నచ్చడమే అసలు సిసలైన విజయం. మా ఈ సినిమా జనాలకు నచ్చాలని కోరుకుంటున్నాను.
హేషమ్ సంగీతం, ఆర్ఆర్ బాగుంటుంది. కెమెరామెన్ అశోక్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వెన్నెల కిషోర్, సత్య ట్రాక్ బాగుంటుంది. సుహాసిని గారు మంచి రోల్‌ను పోషించారు. ఓ కొత్త విలన్ కావాలనే గురు సోమసుందరంను తీసుకున్నాం. ఈ చిత్రంలో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. ఏది తగ్గకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాం. నవంబర్ 17న రాబోతోన్న మా ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడండి. తప్పులు ఉంటే చెప్పండి. మేం నెక్ట్స్ మూవీకి వాటిని సరి చేసుకుంటాం. మా వరకు వంద శాతం కష్టపడ్డాం. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నామ’ని విక్రాంత్ అన్నారు.
మెహరీన్ మాట్లాడుతూ.. ‘స్పార్క్ చిత్రంతో మా విక్రాంత్.. ఓ నటుడు, డైరెక్టర్, రైటర్, నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. అందరి సపోర్ట్ కావాలి. ఇంత వరకు నన్ను మహాలక్ష్మీగా, హనీగా ఆదరించారు. ఈ చిత్రంలో లేఖ పాత్రను కూడా అందరూ మెచ్చుకుంటారు. స్పార్క్ సినిమాకు ప్రేక్షకుల ప్రేమ కావాలి. ప్రేక్షకుల ప్రేమ, అభిమానాలే మా అందరికీ ప్రోత్సాహం. నవంబర్ 17న స్పార్క్ రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.
రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ.. ‘చంద్రమోహన్ గారు మరణించడం చాలా బాధాకరంగా ఉంది. ఆయనకు, ఆయన కుటుంబానికి మా టీం తరుపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. మా విక్రాంత్ మీద రైటర్,డైరెక్టర్, నిర్మాత, యాక్టర్‌గా చాలా బాధ్యతలు మోస్తున్నారు. సెట్‌లో ఎదురైన ఎన్నో సమస్యలను ఎంతో తెలివిగా పరిష్కరించారు. నటుడిగా కాకుండా అన్ని క్రాఫ్ట్‌లను చక్కగా చూసుకున్నారు. ఆయన పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలిం రావాలి. నవంబర్ 17న రాబోతోన్న మా స్పార్క్ సినిమాను విజయవంతం చేయండి’ అని అన్నారు.
ఏపీ విపక్ష పార్టీగా ఉన్న వైసీపీలో జోష్ కనిపించడం లేదు. జగన్ రావాలి.. తమ పార్టీ ముందుకు సాగాలి అన్నట్టుగా…
ప్యాపారుల మంత్రం ధనార్జనే. అందులో తప్పేమీ లేదు. అయితే జనం లైఫ్ స్టైల్ ఆధారంగా ఇష్జారాజ్యంగా ఆర్జించడమే దోపిడీ. మొన్నటిదాకా…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా గడచిన 4 రోజులుగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు గురువారంతో ముగిశాయి. పెట్టుబడులు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా గురువారం చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు…
రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. పనిచేసుకుని పోవడం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో మాత్రం ఏదో గుడ్డిగా పనిచేసుకుని పోతున్నామంటే…
నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ని తమిళ టాప్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్…