ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్‌లో సందడంతా అనువాద చిత్రాలదే. కనీసం ఓ చిన్న సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయలేదు. ఉన్న ఒక్క సినిమా ‘ఆదికేశవ’ను 24కు వాయిదా వేసేసిన సంగతి తెలిసిందే. దీపావళికి ఎప్పుడూ భారీ చిత్రాలను రిలీజ్ చేస్తే కోలీవుడ్, బాలీవుడ్.. ఈసారి కూడా క్రేజీ చిత్రాలను బరిలోకి దింపాయి. ఆ చిత్రాలు తెలుగులో కూడా పెద్ద ఎత్తునే రిలీజ్ ప్లాన్ చేశారు. ఐతే శుక్రవారం రిలీజైన రెండు తమిళ అనువాదాలకు తెలుగులో సరైన స్పందన రాలేదు.
కార్తి మూవీ ‘జపాన్’ మంచి బజ్‌తో రిలీజవగా.. తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కానీ.. టాక్ ఆశాజనకంగా లేదు. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. రెండో రోజు వసూళ్లు పడిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’కు తమిళంలో టాక్ బాగుంది కానీ.. తెలుగు వాళ్లకు అది రుచించడం లేదు. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా బాగా లేవు. దీంతో సినిమా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు.
మొత్తంగా తమిళ డబ్బింగ్ చిత్రాల పనైపోయినట్లే కనిపిస్తోంది. ఇది బాలీవుడ్ డబ్బింగ్ మూవీ ‘టైగర్-3’కి బాగా కలిసొచ్చేదే. ఈ చిత్రం ఆదివారం రిలీజవుతోంది. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజవుతున్న ఈ చిత్రానికి తెలుగులో కూడా పెద్ద ఎత్తునే స్క్రీన్లు ఇచ్చారు. రెండు తమిళ చిత్రాలూ తుస్సుమనిపించడంతో ఫోకస్ అంతా ఈ సినిమా మీదికి మళ్లబోతోంది.
టైగర్ ఫ్రాంఛైజీలో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంది. అందులోనూ ఇందులో షారుఖ్, హృతిక్‌ల క్యామియోలు కూడా ఉన్నాయంటున్నారు. సల్మాన్, కత్రినా జోడీ మీదా ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా చాలు బ్లాక్ బస్టర్ కావడం ఖాయం. తెలుగులో కూడా ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on November 11, 2023 4:03 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…