ఈ మధ్య కమర్షియల్ సినిమాలకు దూరంగా బయోపిక్కులు, యాక్షన్ ఎంటర్ టైనర్లు చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఇకపై కూడా ప్రయోగాలు కొనసాగించేలా ఉన్నాడు. జనవరిలో సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈగల్ కూడా ఒకరకమైన ఎక్స్ పరిమెంటే. తర్వాత చేయబోయే ప్రాజెక్టుల గురించి కొన్ని అప్ డేట్స్ వస్తున్నాయి కానీ వాటిలో ఒక కాంబో ఆసక్తి రేపుతోంది. కిరణ్ అబ్బవరంకి వినరో భాగ్యము విష్ణుకథ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ ఇచ్చిన దర్శకుడు మురళి కిషోర్ అబ్బురు చెప్పిన ఒక లైన్ ఆసక్తికరంగా అనిపించడంతో ఫైనల్ వెర్షన్ అయ్యాక మళ్ళీ వింటానని చెప్పారట.
లెనిన్ టైటిల్ తో 90 బ్యాక్ డ్రాప్ లో చాలా డిఫరెంట్ సెటప్ తో ఉంటుందని వినికిడి. నెరేషన్ ఆసక్తికరంగా అనిపించడంతో ఒకవేళ చివరి డిస్కషన్ కనక వర్కౌట్ అయితే తెరకెక్కే అవకాశాలున్నాయని వినికిడి. లెనిన్ పేరు పెట్టడం వెనుక కూడా చాలా హోమ్ వర్క్ చేసి మరీ ఎంచుకున్నారట. రంగస్థలం నుంచి పీరియాడిక్ డ్రామాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రవితేజ లాంటి హీరోలు అలాంటివి చేస్తే రీచ్ ఎక్కువగా ఉంటుంది. మరి లెనిన్ వెనుక ఉన్న అసలు సంగతేంటో తెలియాలంటే ఓకే అయ్యే దాకా చెప్పలేం. కిరణ్ తో చేశాక మురళి కిషోర్ ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారట.
ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో వర్క్ చేస్తున్న మాస్ మహారాజా నెక్స్ట్ అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాల్ ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ తర్వాత రాజా ది గ్రేట్ కాంబోని రిపీట్ చేసేందుకు అనిల్, రవి ఇద్దరూ సానుకూలంగా ఉన్నారట. ఇక్కడ చెప్పిన రెండు కాంబోలకు ఇంకా నిర్మాత ఎవరన్నది డిసైడ్ అవ్వలేదు. స్క్రిప్ట్ లు లాక్ చేశాకే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. ఈ ఏడాది రవితేజకు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావులు నిరాశ పరిచినా ఈగల్ మీద మాత్రం టీమ్ గట్టి నమ్మకంతో ఉంది. అందుకే విపరీతమైన పోటీ ఉన్నా సరే జనవరి 13నే రిలీజ్ చేస్తున్నారు.
This post was last modified on November 11, 2023 1:11 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…