ఆదివారం విడుదల కాబోతున్న టైగర్ 3 మీద ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏపీ, తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే పాజిటివ్ టాక్ వస్తే చాలు వసూళ్ల మోత ఖాయంగా కనిపిస్తోంది. అయితే ముందస్తు అమ్మకాల్లో పఠాన్, జవాన్ కంటే వెనుబడటం ఫ్యాన్స్ లో ఆందోళన రేపుతోంది. మూడు లక్షలకు దగ్గరగా టికెట్లు సేల్ కావడం చిన్న విషయం కాదు కానీ షారుఖ్ ఖాన్ ని మించి సల్మాన్ ఇమేజ్ ఉందని ఋజువు చేయాలంటే ఈ ఫిగర్లే కీలకం కాబోతున్నాయి. ఇంకో రోజు టైం ఉంది కాబట్టి వేచి చూడాలి. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం.
టైగర్ 3 యష్ రాజ్ ఫిలింస్ సృష్టించిన స్పై యునివర్స్ లో భాగంగా వస్తుందన్న సంగతి తెలిసిందే. టైగర్ జిందా హై, పఠాన్, వార్ లను కలుపుతూ ఈ మూడు సినిమాల హీరోలను ఒక తాటి పైకి భవిష్యత్తులో తీసుకొస్తారు. దానికి శాంపిల్ గా టైగర్ 3లో షారుఖ్ ఖాన్ పావు గంటకు పైగా కనిపించబోతున్నాడు. హృతిక్ రోషన్ ని కూడా దర్శనమివ్వబోతున్నాడు. దీనికి సంబంధించిన ఫుటేజ్ ని ఇటీవలే చిత్రీకరించి ముందు లాక్ చేసుకున్న నిడివికి అదనంగా రెండున్నర నిముషాలు కలిపారు. ట్విస్ట్ ఏంటంటే వార్ 2 లో నటించబోయే జూనియర్ ఎన్టీఆర్ సైతం వీళ్ళతో పాటు కనిపిస్తాడట.
ఇందులో నిజమెంతుందో నిర్ధారణగా చెప్పలేం. పూర్తిగా కొట్టిపారేయలేం కానీ దేవరతో చాలా బిజీగా ఉన్న తారక్ అసలు ఎవరికీ తెలియకుండా టైగర్ 3లో నటించి ఉంటాడా అంటే డౌటే. ముంబై వర్గాలు మాత్రం కన్ఫర్మ్ అని నొక్కి వక్కాణిస్తున్నాయి. వార్ 2 రెగ్యులర్ షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. ప్రస్తుతం హృతిక్, తారక్ తో అవసరం లేని పార్ట్ ని తీస్తున్నారు. డిసెంబర్ లేదా జనవరిలో ఇద్దరు హీరోలు సెట్లో అడుగు పెడతారు. స్పై యూనివర్స్ అన్నారు కాబట్టి ఒకవేళ అలా ఒకటి రెండు షాట్స్ లో తారక్ ఏమైనా మెరుస్తాడేమో ఇంకో నలభై ఎనిమిది గంటల్లో తేలుతుంది.
This post was last modified on November 10, 2023 4:11 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…