హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో మంచి ఊపు మీదున్న బాలయ్యకు భగవంత్ కేసరి సక్సెస్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. కమర్షియల్ పడికట్టుకి దూరంగా హీరోయిన్ తో డ్యూయెట్లు లేకుండా శ్రీలీలకు చిచ్చాగా పెద్దరికంతో చేసిన పాత్ర అభిమానులకే కాదు సగటు ప్రేక్షకులకు సైతం బాగా కనెక్ట్ అయ్యింది. దసరా బరిలో విజేతగా నిలిచి నాలుగో వారంలోనూ రన్ ని కొనసాగించడం చూసి దీపావళికి మళ్ళీ పికప్ ఉంటుందని బయ్యర్లు ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఒక గ్రాండ్ ఈవెంట్ చేశారు. బేటీకో షేర్ బనావో నినాదంతో పని చేసిన నటించిన వారందరికీ ప్రత్యేక మెమెంటోలు ఇచ్చారు.
బాలయ్య తన ప్రసంగంలో ఎవరైనా బాబాయ్ అని పిలిస్తే దబిడి దిబిడి అవుతుందని, తెర మీద శ్రీలీలకు చిచ్చాగా నటించడం చాలా కిక్ ఇచ్చిందని చెబుతూ నిజ జీవితంలో మాత్రం ఊరికే వరసలు కలిపితే ఒప్పుకునే ప్రసక్తే లేదనే సందేశం ఇచ్చారు. అయితే అలా ఎందుకు ఎవరిని అన్నారో అర్థం కాకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఏవేవో ఉపమానాలు చెప్పేసుకుంటున్నారు. బాలకృష్ణని అలా పిలిచే వాళ్ళలో కుటుంబంలో ఎందరున్నా అభిమానులకు గుర్తొచ్చేది కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లే. వాళ్ళ ప్రేమాభిమానులు గతంలో ఎన్నోసార్లు ఎన్నో వేదికలపై బయట పడ్డాయి.
కాబట్టి వాళ్ళను ఉద్దేశించి అనుండకపోవచ్చని ఒక వెర్షన్. కొద్దిరోజుల క్రితం చంద్రబాబునాయుడు అరెస్ట్ అయ్యాక తారక్ స్పందించకపోవడం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బాలయ్య డోంట్ కేర్ అని చెప్పడం ఆ వీడియో బాగా చక్కర్లు కొట్టింది. ఇప్పుడేమో బాబాయ్ అని పిలిస్తే దబిడి దిబిడే అంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం అది ఫ్లోలో బయటవాళ్ళను ఉద్దేశించి అన్నదని, మీడియం రేంజ్ హీరోలు ఈ మధ్య కలిసినప్పుడు అలా పిలవడం ఆయనకు నచ్చలేదని, అందుకే స్మూత్ వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా వైరల్ కంటెంట్ ఇవ్వనిదే బాలయ్య మాట్లాడ్డం అరుదే.
This post was last modified on November 10, 2023 4:05 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…