వచ్చే వారం 17న విడుదల కాబోతున్న మంగళవారం మీద క్రమంగా అంచనాలు ఎగబాకుతున్నాయి. ప్రీ రిలీజే ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని తీసుకొచ్చేందుకు నిర్మాతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. బిజినెస్ పరంగా క్రేజ్ వచ్చేయడంతో టాక్ కనక పాజిటివ్ తెచ్చుకుంటే విరూపాక్ష స్థాయిలో విజయం సాధిస్తుందని బయ్యర్లు దీని మీద గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా హైప్ మారిపోయింది. దీనికి తోడు ఇటీవలే మా ఊరి పొలిమేర 2 సాధించిన విజయం చూశాక సీరియస్ హారర్ ని కనెక్ట్ చేసేలా చూపిస్తే వసూళ్ల వర్షం ఖాయమని ట్రేడ్ జనాలకు అర్థమైపోయింది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక ట్విస్టు కథని ఎవరూ ఊహించని స్థాయిలో మలుపులు తిప్పుతుందని ఇన్ సైడ్ టాక్. ప్రధాన పాత్ర పోషిస్తున్న పాయల్ రాజ్ పుత్ కామవాంఛతో రగిలిపోవడం, ఈ కోరిక కారణంగానే ఊహించని ఘోరాలు జరిగి కథనం చాలా షాకింగ్ గా సాగుతుందని చెబుతున్నారు. దర్శకుడు అజయ్ భూపతి క్యారెక్టరైజేషన్ ని తీర్చిదిద్దిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని, అందుకే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అంత కాన్ఫిడెంట్ గా చెప్పారని అంటున్నారు. మొత్తం సపోర్టింగ్ ఆర్టిస్టులతో తీసిన మంగళవారం టెక్నికల్ గా చాలా రిచ్ కంటెంట్ తో వస్తోందట.
పోటీ పెద్దగా లేని అవకాశాన్ని మంగళవారం ఎలా వాడుకుంటుందో చూడాలి. దీపావళి మొత్తాన్ని డబ్బింగ్ సినిమాలకు వదిలేయడంతో నవంబర్ మూడో వారం నుంచి మనవి తిరిగి ట్రాక్ ఎక్కబోతున్నాయి. సప్త సాగరాలు దాటి సైడ్ బి, స్పార్క్ ది లైఫ్ ఉన్నప్పటికీ బజ్ పరంగా చూసుకుంటే మంగళవారం ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇది హిట్ అయితే మళ్ళీ కెరీర్ ఊపందుకుంటుందనే నమ్మకంతో పాయల్ రాజ్ పుత్ ఉంది. హీరోయిన్ ఆఫర్లు కాకపోయినా కంటెంట్ ని నమ్ముకుని తీసే వెబ్ సిరీస్, సినిమాల్లో ఛాన్స్ రావొచ్చుగా.
This post was last modified on November 9, 2023 3:53 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…