Movie News

దీపావళి వారం – అనువాద సమర్పణం

రేపు శుక్రవారం మొదలుపెట్టి ఆదివారం దాకా టాలీవుడ్ బాక్సాఫీస్ కు డబ్బింగ్ సినిమాలే దిక్కవుతున్నాయి. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల దీపావళిని తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు వదిలేసుకున్నాయి. కార్తీ ‘జపాన్’ మీద ఓ మోస్తరు అంచనాలున్నాయి. బుకింగ్స్ నెమ్మదిగా సాగుతుండగా కార్తీ ఏకధాటిగా ప్రమోషన్లలో పాల్గొని వీలైనంత బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. హీరోయిన్, డైరెక్టర్, మ్యూజిక్ పరంగా పెద్దగా క్రేజ్ లేని అంశాలు తోడవ్వడంతో భారం మొత్తం తన మీదే పడింది. లారెన్స్ ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ కోసం అతను ఎస్జె సూర్య కలిసి తెలుగు మీడియాకు అలసిపోకుండా నాన్ స్టాప్ ఇంటర్వ్యూలు ఇచ్చేశారు

దీనికీ ఏమంత హైప్ లేదు కానీ టాక్ వస్తే ఒక్కసారిగా పై రెండు ఊపందుకునే ఛాన్స్ లేకపోలేదు. ఒక రోజు గ్యాప్ తో స్రవంతి రవికిశోర్ ‘దీపావళి’ని తీసుకొస్తున్నారు. ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్టులు తప్ప హీరోలు లేరు. బలగం రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని నిర్మాత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కానీ అదెంత వరకు నిజమవుతుందో వేచి చూడాలి. రేపే హాలీవుడ్ మూవీ ‘ది మార్వెల్స్’ ని దింపుతున్నారు. ఇది ఏ మేరకు జనాన్ని ఆకట్టుకుంటుందో చూడాలి. సండే రోజు కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ తో దూసుకొస్తాడు. బుకింగ్ అరాచకంగా లేవు కానీ ఇండియా వైడ్ రెండు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి.

ఇవన్నీ కాకున్నా ‘అలా నిన్ను చేరి’ అనే ఇంకో డైరెక్ట్ మూవీ తప్ప నేరుగా వస్తున్న తెలుగు సినిమాలైతే లేవు. ఇన్నేసి అనువాద చిత్రాలు ఒకేసారి రావడం మాత్రం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారని చెప్పొచ్చు. వినాయక చవితి టైంలోనూ సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల దాన్ని మార్క్ ఆంటోనీకి వదిలేయాల్సి వచ్చింది. దాని వల్ల వచ్చిన ఫలితమూ సున్నానే. ఇప్పుడు పైన చెప్పిన వాటిలో ఏవి జనాన్ని ఆకట్టుకుంటాయో చూడాలి. మా ఊరి పొలిమేర 2, కీడా కోలా, భగవంత్ కేసరి రన్ కొనసాగబోతున్నాయి. టైగర్ నాగేశ్వరరావు సెలవు తీసుకోవడం లాంఛనమే. ఓటిటి లియో నవంబర్ 16 వచ్చేస్తుంది.

Share

Recent Posts

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

55 minutes ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

3 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

3 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

3 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

5 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

8 hours ago