ఒక కథ అనుకుని దాంతో సినిమా మొదలుపెట్టాక ఫుటేజ్ ఎక్కువైంది అనిపిస్తే చాలు.. సెకండ్ పార్ట్ అంటున్నారు ఈ మధ్య ఫిలిం మేకర్స్. ‘బాహుబలి’ సినిమా రెండు భాగాలుగా వచ్చి అద్భుతమైన స్పందన తెచ్చుకోవడం.. రెట్టింపు ఆదాయం తెచ్చిపెట్టినప్పటి నుంచి ఈ ఒరవడి ఊపందుకుంది. ‘పుష్ప’ను కూడా ఒక సినిమాగా మొదలుపెట్టి తర్వాత రెండు భాగాలు చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాకు మూడో భాగం తీసే ఆలోచన కూడా ఉందట.
కానీ అదెంత వరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. కాగా దక్షిణాదిన తెరకెక్కుతున్న మరో భారీ చిత్రం ‘ఇండియన్-2’ కూడా అంతటితో ఆగిపోదట. దానికి కూడా మూడో భాగం ఉంటుందట. ఈ విషయం ‘ఇండియన్-2’లో నిర్మాణ భాగస్వామి అయిన ఉదయనిధి స్టాలిన్ స్వయంగా వెల్లడించాడు. ‘ఇండియన్-3’ ఉంటుందని ఇంతకుముందే ప్రచారం జరిగింది. కానీ దానిపై క్లారిటీ లేదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘ఇండియన్-2’ ఫుటేజ్ చాలా ఎక్కువగా వచ్చిందని.. దీని కథ విస్తృతి ఎక్కువ అని.. కాబట్టి ‘ఇండియన్-3’ కూడా వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమాకు కమల్ హాసన్ కొత్తగా 40 రోజుల డేట్లు ఇచ్చాడని.. షూటింగ్ జరుగుతోందని.. శంకర్, కమల్ ఇద్దరూ కూడా ఔట్‌పుట్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారని.. ఈ సినిమాకు మూడో భాగం చేసే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని అతనన్నాడు.
ఇండియన్-2 వచ్చే ఏప్రిల్లో రిలీజవుతుందని ఉదయనిధి ధ్రువీకరించాడు. ఇండియన్-2కు ఒక చోట బ్రేక్ ఇచ్చి.. ఇందులో మిగిలిన కంటెంట్‌కు మరికొంత జోడించి ఇండియన్-3ని సెట్ చేయాలన్నది శంకర్ ఆలోచన అట. ఇండియన్-3ని కూడా వచ్చే ఏడాది చివర్లోనే రిలీజ్ చేయాలని కూడా శంకర్ భావిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతోంది.
This post was last modified on November 9, 2023 11:09 am
నిన్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి గురించి గొప్పగా చెప్పడం…
నాగచైతన్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ తండేల్ నుంచి నిన్న ఓం నమః శివాయ…
ఓవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతుండగా.. ఆ తర్వాత మోస్ట్ అవైటెడ్ డెబ్యూ అంటే అకీరా నందన్దే.…
టాలీవుడ్లో సంగీత దర్శకుడు భీమ్స్ది ఎంతో ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయక ప్రయాణం. పేద కుటుంబానికి చెందిన అతను.. యుక్త వయసులో పడ్డ…
ఏపీలో కూటమిగా ఉన్న టీడీపీ-బీజేపీ మధ్య సఖ్యత బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని నియోజక వర్గాల్లో చోటు చేసుకుంటున్న…
ప్రగతి రథం రైలు బండి పోతున్నాది.. అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాడుకుంటున్నారు. ఏడాది పాలనలో తెలంగాణలో సీఎం రేవంత్…