భారతీయ ప్రేక్షకులంతా ఇప్పుడు అత్యధిక అంచనాలతో ఎదురు చూస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి. ఇది పేరుకు సౌత్ మూవీ కానీ.. ఉత్తరాదిన కూడా బంపర్ క్రేజ్ ఉందీ చిత్రానికి. సెప్టెంబరు 28న రావాల్సిన ఈ చిత్రాన్ని క్రిస్మస్‌కు వాయిదా వేసినా, ఇప్పటిదాకా సరైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇవ్వకపోయినా.. ఒక పద్ధతి ప్రకారం ప్రమోషన్లు చేయకపోయినా.. సలార్‌కు హైప్ అయితే తక్కువ లేదు.
రిలీజ్ డేట్ మారడం వల్ల బిజినెస్ పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ.. ఒక్కొక్కటిగా డీల్స్ సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది హోంబలె ఫిలిమ్స్. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు భారీ మొత్తానికి సలార్ హక్కులు కొన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఓవర్సీస్ రైట్స్ సంగతి కూడా ఆల్రెడీ తేలిపోయినట్లు తెలుస్తోంది. సౌత్‌లో మిగతా భాషల డీల్స్ మీద సంప్రదింపులు జరుగుతున్నాయి.
కాగా సలార్ హిందీ డీల్‌కు సంబంధించి ఇప్పుడో సెన్సేషనల్ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. ఆల్రెడీ ఓకే అయిన డీల్ ఇప్పుడు క్యాన్సిల్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. సలార్ హిందీ హక్కులను ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొన్ని నెలల కిందటే తీసుకుంది. ఐతే సినిమా రిలీజ్ వాయిదా పడటం.. క్రిస్మస్ సీజన్లో డంకీతో పోటీ పడాల్సి రావడంతో ఈ డీల్ ఇప్పుడు డోలాయమానంలో పడిందట.
ఇప్పుడు ఆ సంస్థ ఒప్పందం నుంచి వైదొలిగినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా పెద్ద సంస్థ కావడంతో హిందీ రిలీజ్ పరంగా సమస్య ఉండదని.. తాము కోరుకున్న రేటు కూడా వస్తోందని హోంబలె వాళ్లు సంతోషంగా ఉన్నారు. కానీ మారిన పరిస్థితుల్లో ఈ డీల్ ఓకే చేయడం రిస్క్ అని ఆ సంస్థ వెనక్కి తగ్గిందని.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా హిందీ డీల్ మీద అనిశ్చితి నెలకొనడం హోంబలె వాళ్లకు పెద్ద తలనొప్పే అని టాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.
This post was last modified on November 8, 2023 10:48 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…