టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ న్యూడ్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని దుర్యోగపరుస్తూ కొందరు చేస్తున్న ఇటువంటి చర్యలు తలుచుకుంటే భయమేస్తుందని బాలీవుడ్ బిగ్ అమితాబచ్చన్ స్పందించారు ఆయనతోపాటు వ్యవహారంపై పలువురు సెలబ్రిటీలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ స్పందించింది. రష్మిక మందన్నకు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అండగా నిలిచింది.
ఈ క్రమంలోనే రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో పై హైదరాబాద్ డీజీపీ అంజనీ కుమార్ కు టాలీవుడ్ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫిర్యాదు చేశారు. ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ రాంబాబులు అంజనీ కుమార్ కి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అంజనీ కుమార్ అభినందించారు. ఈ కేసును సైబర్ క్రైం కు అప్పగించి దర్యాప్తు చేయమని ఆదేశించారు. ఇటువంటి ఘటనలు జరిగిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిపై చర్యలు తీసుకుంటామని అంజనీ కుమార్ హామీ ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates