ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్లను నిర్దేశించేది సక్సెస్ లే. అవి ఉంటేనే అవకాశాలు క్యూ కడతాయి. ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ అందుకుని తర్వాత వరస ఫ్లాపులతో కృతి శెట్టి ఏమయ్యిందో ఠక్కున చెప్పడం కష్టం. చేతిలో ఒకటో రెండో సినిమాలున్నాయి కానీ స్టార్ హీరోలలు తనను ఆప్షన్ గా చూడటం మానేశారు. తనకే ఇలా ఉంటే ఇక మెహ్రీన్ గురించి చెప్పేదేముంది. గతంలో రవితేజ, నాని, వరుణ్ తేజ్, శర్వానంద్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, నాగ శౌర్య, గోపిచంద్ లాంటి స్టార్లతో నటించి ఇప్పుడు అవకాశాలు లేకుండా అయిపోయింది. కొత్త హీరోతో నటించిన స్పార్క్ 17న విడుదల కానుంది.
ఎఫ్2 హిట్ అయ్యాక టాలీవుడ్ లో సెటిలైపోయినట్టేనని మెహ్రీన్ భావించింది. అయితే డిజాస్టర్లు క్యూ వరసగా పలకరించడం వల్ల ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పైగా భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం అయ్యాక పెళ్లి రద్దు చేసుకోవడం లాంటి వ్యక్తిగత అంశాలు కొంత ప్రభావం చూపించాయి. ఈ మధ్యే హాట్ స్టార్ వెబ్ సిరీస్ సుల్తాన్ అఫ్ ఢిల్లీతో ఓటిటి ఎంట్రీ ఇచ్చింది. అందులో ఆధర చుంబనాలకు సైతం ఓకే చెప్పింది కానీ పనవ్వలేదు. మీర్జాపూర్ రేంజ్ లో బ్లాక్ బస్టరవుతుందేమో అనుకుంటే దాని రివ్యూలు, రిపోర్టులు ఆశాజనకంగా లేవు. దీంతో అక్కడా నిరాశ తప్పలేదు.
సో ఏ బ్రేక్ దొరకాలన్నా అది స్పార్క్ చేతిలోనే ఉంది. ట్రైలర్ చూస్తేనేమో వెరైటీగా ఉంది. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఏదో కమర్షియల్ టచ్ తో ప్రయోగం చేశారు. ప్రమోషన్లు గట్రా చేస్తున్నారు కానీ ఆడియన్స్ ని మొదటి రోజు థియేటర్లకు రప్పించడం సవాలే. పైగా అజయ్ భూపతి మంగళవారం అదే రోజు క్లాష్ అవుతోంది. దానికున్న బజ్ తో పోల్చుకుంటే స్పార్క్ ఎదురీదాల్సి ఉంటుంది. ఎక్స్ ట్రాడినరీ అనే టాక్ తెచ్చుకోవాలి. ఒకప్పుడు మీడియం రేంజ్ స్టార్ హీరోలతో జట్టు కట్టి ఇప్పుడు కొత్త హీరోతో హిట్టు పడాలని కోరుకుంటున్న మెహ్రీన్ కు ఇదైనా కోరుకున్న బ్రేక్ ఇస్తుందో లేదో వచ్చే వారం తేలిపోతుంది.
This post was last modified on November 8, 2023 8:35 pm
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…