హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాగా ఎన్బికె 109 మీద అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఇవాళ షూటింగ్ ప్రారంభానికి సంకేతంగా ఒక ప్రీ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సంగీత దర్శకుడి పేరు ప్రస్తావించకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. మూడు ఆప్షన్లు తీవ్ర పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. సితార ఎంటర్ టైన్మెంట్స్ కి తమన్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్. నాగవంశీ, త్రివిక్రమ్ లతో చాలా బాండింగ్ ఉంది. వాళ్ళిద్దరి రికమండేషన్ సహజంగానే తన వైపు ఉంటుందని చెప్పడంలో డౌట్ లేదు.
ఇక్కడో పాయింట్ ఏంటంటే అఖండ రేంజ్ లో మిగిలిన రెండు బాలయ్య సినిమాలకు తమన్ అంత మేజిక్ చేయలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే కానీ పాటల పరంగా పూర్తి సంతృప్తినివ్వలేదన్నది వాస్తవం. అందుకే బాబీ మార్పు కోసం అనిరుధ్ ని ట్రై చేద్దామని అంటున్నాడట. అతనేమో మాములు బిజీగా లేడు. దేవర, విజయ్ దేవరకొండ 12 మ్యూజిక్ సిట్టింగ్స్ కే టైం దొరక్క దర్శక నిర్మాతలు వెయిటింగ్ మోడ్ లో ఉన్నారు. అలాంటప్పుడు 2024 వేసవి రిలీజ్ ని లక్ష్యంగా పెట్టుకున్న బాలయ్య మూవీ ఆ టార్గెట్ చేరుకోవడం కష్టం. ఎంత ఒత్తిడి పెడితే అనిరుధ్ నుంచి అంత అవుట్ ఫుట్ తేడా కొడుతుందని చెన్నై టాక్.
ఇక మిగిలిన రైట్ ఆప్షన్ దేవిశ్రీ ప్రసాదే అవుతాడు. వాల్తేరు వీరయ్యకు తనిచ్చిన ట్యూన్లు, బీజీఎమ్ దాని బ్లాక్ బస్టర్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. బాబీకి తనతో మంచి సింక్ ఉంది. ఒకవేళ తమన్, దేవి ఇద్దరిలో ఒకరు కావాలంటే బహుశా రెండో పేరుకే ఓటు వేసే ఛాన్స్ ఉంది. ఇది తేలలేదు కాబట్టే పోస్టర్ లో పేరు లేకుండా వదలాల్సి వచ్చింది. బాలయ్య తొంభై రోజుల కాల్ షీట్స్ తో మొత్తం షూట్ పూర్తి చేసేలా బాబీ ప్లాన్ చేసుకున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఏపీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి కాబట్టి ఆలోగానే వీలైనంత ఫినిష్ చేసి ఒత్తిడి లేకుండా చూసుకునేలా సితార బృందం జాగ్రత్తలు తీసుకుంటోంది.
This post was last modified on November 8, 2023 4:03 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…