‘అయ్యారే’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సాగర్ చంద్ర. చిన్న సినిమా అయినా దానికి మంచి పేరే వచ్చింది. కానీ అది బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా ఆడలేదు. ఐతే కొన్నేళ్ల విరామం తర్వాత శ్రీ విష్ణు, నారా రోహిత్ కాంబినేషన్లో అతను తీసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. దీనికి బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి ఫలితమే వచ్చింది.
కానీ ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడు నాలుగేళ్ల పాటు ఇంకో సినిమా లేకుండా ఖాళీగా ఉండిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘అప్పట్లో..’ విడుదలైన కొన్ని నెలలకే వరుణ్ తేజ్ హీరోగా సాగర్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ చిత్రం ఇక పట్టాలెక్కడమే తరువాయి అనుకున్నారు కానీ.. ఎందుకో ఆగిపోయింది. దీన్ని ఆపేసి వరుణ్ ‘తొలి ప్రేమ’ను ఓకే చేశాడు. అది మంచి విజయం సాధించింది. తర్వాత వేరే కమిట్మెంట్ల వైపు వెళ్లిపోయాడు.
లాక్ డౌన్ ముందు వరుణ్.. కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో బాక్సింగ్ నేపథ్యంలో ఓ భారీ బడ్జెట్ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీని తర్వాత అతడి కోసం ‘ఎఫ్-3’ కూడా ఎదురు చూస్తోంది. ఐతే ఆ సినిమాతో పాటే వరుణ్ మరో చిత్రాన్ని ఓకే చేశాడట. దానికి దర్శకుడు సాగర్ చంద్రనే అని సమాచారం. సాగర్‌తో సినిమా తీయడానికి ఎప్పట్నుంచో ఆసక్తితో ఉన్న 14 రీల్స్ ప్లస్ వాళ్లు ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం.
ఐతే వరుణ్ ‘ఎఫ్-3’ కంటే ముందు దీన్ని మొదలుపెడతాడా.. తర్వాతా అన్నది తెలియట్లేదు. లాక్ డౌన్ టైంలో సాగర్ చెప్పిన కథకు అతను ఓకే చెప్పాడట. మరోవైపు వరుణ్ ‘బాక్సర్’ సినిమా కోసం చాలానే కష్టపడుతున్నాడు. లాక్ డౌన్ టైంలో కూడా ట్రైనింగ్ ఆపలేదు. సెప్టెంబరులోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి. అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 28, 2020 1:50 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…