డార్లింగ్ ప్రభాస్ సుదీర్ఘ యూరోప్ ట్రిప్ తర్వాత తిరిగి వచ్చేశాడు. మోకాలి గాయంతో రెండు నెలలు అక్కడే చికిత్సతో పాటు విశ్రాంతి తీసుకున్న బాహుబలి ఇండియాలో అడుగు పెట్టేశాడు. అక్టోబర్ లో తన పుట్టినరోజు నాడు అందుబాటులో లేకపోవడం, రిలీజ్ దగ్గరలో పెట్టుకుని కూడా సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో కొన్ని ఉపశమన చర్యలు ఇప్పటికిప్పుడు అవసరం. ముఖ్యంగా డిసెంబర్ 22 ఎంతో దూరంలో లేదు. సరిగ్గా ఓ నలభై రెండు రోజులు గడిచిపోతే వచ్చేస్తుంది. ఇంకా పబ్లిసిటీనే మొదలు కాలేదు కానీ చాలా పుకార్లు వ్యాపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సలార్ టీమ్ వెంటనే మేల్కోవాలి. ఎంత హైప్ ఉన్నా సరే తమ ప్రోడక్ట్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకూడదు. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి ఇద్దరు హీరోలకు వెంటేసుకుని దేశమంతా తిరిగాడు. అడిగినవాళ్లకు కాదనకుండా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇతర రాష్ట్రాల్లో ఈవెంట్లు చేశాడు. అంత పెద్ద మల్టీస్టారర్ కే ఆ రేంజ్ లో కష్టపడాల్సి వచ్చింది. అలాంటిది సలార్ విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యమైనా కరెక్ట్ కాదు. ముంబై నుంచి హైదరాబాద్ దాకా ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేయాలి. అసలు ముందైతే సరైన టీజర్ ఒకటి వదిలి హైప్ ని పెంచే దిశగా ఏర్పాట్లు చేసుకోవాలి.
డిసెంబర్ 22కి అనుగుణంగా బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ అగ్రిమెంట్లు చేసుకుంటున్నారనే వార్తలు తిరుగుతున్నాయి. ఇంకో వైపు ఏమో వాయిదా పడొచ్చేమో, ఆ డేట్ కి రవితేజ ఈగల్ రావొచ్చేమోననే కొత్త గాసిప్పులు పుట్టుకొచ్చాయి. ఏది ఏమైనా హోంబాలే ఫిలిమ్స్ తరఫున వీలైనంత త్వరగా అఫీషియల్ నోట్స్ రావడం చాలా అవసరం. దీపావళి ఇంకో నాలుగు రోజుల్లో ఉంది. కనీసం ఒక కొత్త పోస్టర్ అయినా వదులుతారో లేదో చూడాలి. దసరాకి ఇలాగే ఊరించి నిరాశపరిచారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండి అసలు బయట కనిపించడమే బొత్తిగా మానేశారు. ఒత్తిడి అలా ఉంది మరి.
This post was last modified on November 8, 2023 11:27 am
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…