సినీ రంగంలో నటీనటులకు అందం.. అభినయం రెండూ ఉన్నంత మాత్రాన విజయవంతం అవుతారని గ్యారెంటీ ఏమీ లేదు. దానికి కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలి. అవకాశాలు అందుకుంటే సరిపోదు. వచ్చిన అవకాశాలు మంచివై ఉండాలి. చేసే సినిమాలు విజయవంతం కావాలి. తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి విషయంలో ఇవే జరగలేదు. ఆమెలో అందం ఉంది. నటన విషయంలోనూ ఢోకా లేదు.
‘మధురం’ సహా ఆమె నటించిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చూస్తే తన టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. ఐతే సినిమాల్లో అవకాశాలైతే అందుకుంది కానీ.. అవేవీ ఆమెకు కలిసి రాలేదు. ‘కుందనపు బొమ్మ’.. ‘బ్రహ్మోత్సవం’.. ‘హౌరా బ్రిడ్జ్’.. ‘మను’ లాంటి సినిమాల్లో నటించిన చాందినికి ఆ సినిమాలు చేదు అనుభవాలే మిగిల్చాయి. చివరగా చేసిన ‘మను’ మీద చాందిని చాలా ఆశలే పెట్టుకుంది. ‘మధురం’ షార్ట్ ఫిలింతో ఆకట్టుకున్న ఫణీంద్రనే తీసిన ఈ సినిమా కచ్చితంగా తనకు బ్రేక్ ఇస్తుందనుకుంది. కానీ అలా జరగలేదు.
ఈ మధ్య వెబ్ సిరీస్ అరంగేట్రం చేసినప్పటికీ చాందిని రాత మారలేదు. ఐతే ఇప్పుడు తాను చేస్తున్న ఓ సినిమా.. తాను ఇన్నేళ్లుగా ఆశిస్తున్న బ్రేక్ కచ్చితంగా ఇస్తుందనే ఆశతో ఉంది చాందిని. ఆ సినిమానే.. కలర్ ఫోటో. కమెడియన్‌గా సత్తా చాటిన సుహాస్ పక్కన చాందిని కథానాయికగా నటిస్తుండటం విశేషం. ఇదొక ‘బ్లాక్ అండ్ వైట్’ లవ్ స్టోరీ. హీరో సుహాస్ అని చూడకుండా కథకున్న ప్రత్యేకత చూసి ఈ సినిమా చేసింది చాందిని. దీని టీజర్, కొత్తగా రిలీజైన పాట చూస్తే సినిమా ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది. సుహాస్ మిత్రుడే అయిన సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
‘హృదయ కాలేయం’ దర్శక నిర్మాత సాయిరాజేష్ నీలం ఈ సినిమాకు కథ అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించాడు. ప్రోమోలు చూస్తుంటే చాందిని టాలెంటుకు తగ్గ పాత్ర దక్కిందని.. ఈసారి కచ్చితంగా తన ఆశ, తన అభిమానుల ఆశ తీరుతుందని అనిపిస్తోంది. చూద్దాం మరి ఏమవుతుందో?
This post was last modified on August 28, 2020 1:49 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…