లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మూడు దశాబ్దాలుగా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్న తీరు అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే ఒకప్పటి ప్రేమదేశం, భారతీయుడు, బొంబాయి రేంజ్ లో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం లేదనే కామెంట్స్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. పొన్నియిన్ సెల్వన్ లోనూ ఠక్కున గుర్తొచ్చే పాటలు కానీ, సిగ్నేచర్ బిజిఎం కానీ పెద్దగా ఉండవు. అందుకే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16ని ఆయన్ని ఎంచుకున్నప్పుడు ఫ్యాన్స్ లో సందేహాలు తలెత్తాయి.
ఇప్పుడవి తీరినట్టే అనిపిస్తోంది. నిన్న రిలీజైన కమల్ హాసన్ 234వ సినిమా తగ్స్ లైఫ్ వీడియో ప్రోమోలో ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా గొప్పగా అనిపించింది. ఎన్నో ఏళ్ళ తర్వాత తన స్థాయి అవుట్ ఫుట్ వినిపించిందని అభిమానులు సంబరపడ్డారు. దీనికి దర్శకుడు మణిరత్నం కాబట్టి రెహమాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉండొచ్చు కానీ ఏదైనా రాబట్టుకునే డైరెక్టర్ల టాలెంట్ మీద ట్యూన్లు ఆధారపడి ఉంటాయి. గేమ్ చేంజర్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో ఆర్సి 16 మీద మాములు అంచనాలు నెలకొనలేదు. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకపోయినా గ్రౌండ్ లెవెల్ లో హైప్ భారీగా ఉంది.
ప్రస్తుతానికి మ్యూజిక్ సిట్టింగ్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలుకాలేదు. అసలు షూట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో క్లారిటీ వస్తే ఆలోగా ట్యూన్స్ సిద్ధం చేయించే ప్లాన్ లో బుచ్చిబాబు ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులైతే చకచకా జరుగుతున్నాయి. ఎదురు చూసే కొద్దీ చరణ్ ని శంకర్ వదలడం లేదు. అదిగో ఇదిగో అంటూ షెడ్యూల్స్ వరసగా ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ 2 వల్ల ఈ జాప్యం జరుగుతున్నా నిర్మాత దిల్ రాజుతో సహా ఎవరూ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. చిరంజీవి సైరాని మిస్ చేసిన రెహమాన్ ఇప్పుడు కొడుకు చరణ్ కి ఎలాంటి ఆల్బమ్ ఇస్తాడోననే ఎగ్జైట్ మెంట్ ఫ్యాన్స్ లో చాలా ఉంది.
This post was last modified on November 7, 2023 1:39 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…