మాములుగా స్టార్ క్యాస్టింగ్ లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడం సవాల్ లాంటిది. అందుకే గీత ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న కోటబొమ్మాళి పీఎస్ బృందం తెలివిగా ఆలోచించి ముందు మ్యూజిక్ తో మొదలుపెట్టింది. లింగిడి లింగిడి పాట జనంలోకి బాగా చొచ్చుకువెళ్ళింది. మలయాళం బ్లాక్ బస్టర్ నాయట్టుకి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ కాప్ థ్రిల్లర్ కి జోహార్ ఫేమ్ తేజ మర్ని దర్శకత్వం వహించాడు. తక్కువ టైంలోనే షూటింగ్ పూర్తి చేశారు. నవంబర్ 24 విడుదలకు రెడీ అవుతున్న తరుణంలో ఇవాళ ప్రసాద్ ల్యాబ్ లో ట్రైలర్ లాంచ్ చేశారు.
స్టోరీకి సంబంధించిన కీలక క్లూస్ ఇచ్చారు. కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ ఫర్ మీద వస్తాడు రామకృష్ణ(శ్రీకాంత్). దూకుడు మనస్తత్వం. తప్పు చేసినవాడికి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లెక్క చేయడు. ఈ ప్రవర్తనే ఓ ప్రమాదంలో పడేస్తుంది. ఒక్కణ్ణే కాదు సహద్యోగులు(రాహుల్ విజయ్ – శివాని రాజశేఖర్)కూడా అందులో ఇరుక్కుని ముగ్గురు కలిసి పారిపోతారు. వీళ్ళను పట్టుకోవడానికి మంత్రి (మురళి శర్మ) ఒక లేడీ ఆఫీసర్(వరలక్ష్మి శరత్ కుమార్)ని పంపిస్తాడు. పోలీసులను పోలీసులే పట్టుకునేందుకు ప్రయత్నించే విచిత్రమైన ఆట మొదలవుతుంది. అదేంటో తెరమీద చూడాలి.
ఆద్యంతం ఆసక్తి రేపెలా ట్రైలర్ కట్ చేశారు. స్క్రీన్ ప్లే ప్రధానంగా నడిచే కథ కాబట్టి ఒరిజినల్ కు అనుగుణంగా కొన్ని కీలక మార్పులతో మన ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు మార్చినట్టు కనిపిస్తోంది. రంజన్ రాజ్ సంగీతం సమకూర్చిన కోటబొమ్మాళి పీఎస్ కి జగదీశ్ చీకటి ఛాయాగ్రహణం సమకూర్చారు. రాజకీయ అంశాలతో ముడిపడిన పోలీస్ క్రైమ్ డ్రామా ఇది. మన ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కంటెంట్ అయితే ఉంది. ఆకట్టుకునే టైటిల్ తో పాటు మేకింగ్ పరంగా హైప్ వచ్చేలా చేయడంతో అంచనాలైతే మొదలవుతాయి. 24న వైష్ణవ్ తేజ్ ఆదికేశవతో కోటబొమ్మాళి పీఎస్ పోటీపడబోతోంది
This post was last modified on November 6, 2023 10:58 pm
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…