మొన్న శుక్రవారం విడుదలైన సినిమాలు కీడా కోలా, మా ఊరి పొలిమేర 2 దిగ్విజయంగా మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకున్నాయి. తరుణ్ భాస్కర్ కంటెంట్ యుఎస్ లో అర మిలియన్ దాటేసి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగా, తెలుగు రాష్ట్రాలు అందులోనూ ఏపీలో కొంత వెనుకబడి ఉంది. నైజామ్ లో మాత్రం స్ట్రాంగ్ ఉందని నిన్నటి దాకా నమోదైన వసూళ్ల సారాంశం. సుమారు 10 కోట్ల 50 లక్షల గ్రాస్ తో 5 కోట్ల 50 లక్షల దాకా షేర్ సాధించినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఇందులో అధిక భాగం యుఎస్ నుంచి వచ్చిందే. బ్రేక్ ఈవెన్ కి ఇంకో మూడున్నర కోట్ల దాకా రావాలి. దీపావళి దాకా ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది.
ఇక మా ఊరి పొలిమేర 2 అందరి అంచనాలు తలకిందులు చేసింది. కీడా కోలాకు పోటీగా ఇది కూడా 10 కోట్ల గ్రాస్ తో 6 కోట్లకు దగ్గరగా షేర్ తెచ్చుకున్నట్టు సమాచారం. జరిగిన బిజినెస్ కేవలం 4 కోట్లే కావడంతో ఆల్రెడీ కోటిన్నర లాభాలతో బయ్యర్లు హ్యాపీగా ఉన్నారు. ఇంత ఫాస్ట్ గా బ్రేక్ ఈవెన్ కావడం ఊహించనిది. ఇవాళ సోమవారం నుంచి సహజంగా ఉండే డ్రాప్ ఎంత మోతాదులో ఉంటుందనే దాన్ని బట్టి ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంది. పది రోజులకు మించి స్టడీ రన్ ఉంటుందని ఎగ్జిబిటర్ల అంచనా. డివైడ్ టాక్ ఉన్నా సరే ట్విస్టులతో కూడిన హారర్ కంటెంట్ జనాన్ని రప్పిస్తోంది.
ఈ వారం కార్తీ జపాన్, లారెన్స్ జిగర్ తండా డబుల్ ఎక్స్, సల్మాన్ ఖాన్ టైగర్ 3 లు రాబోతున్నాయి. అన్నీ స్టార్ క్యాస్టింగ్ ఉన్నవి కావడంతో ఆలోగా కీడా కోలా, మా ఊరి పొలిమేర 2 వీలైనంత మొత్తాన్ని లాగేసేయాలి. కావాల్సినన్ని స్క్రీన్లు అందుబాటులో ఉండటంతో ఎక్కడైనా అదనపు షోలు అవసరమైనా వెంటనే దొరికేస్తున్నాయి. ఈ విషయంలో పొలిమేరనే ఒక అడుగు ముందుంది. ఏదీ డిజాస్టర్ కాకపోవడం ఊరట కలిగించే విషయం. మూడో తేదీ ఇంకా వేరే కొత్త రిలీజులు మరో ఏడు దాకా ఉన్నప్పటికీ వాటికి స్పందన దక్కకపోవడంతో కనీసం థియేటర్ల ఫీడింగ్ కి కూడా ఉపయోగపడలేదు.
This post was last modified on November 6, 2023 6:22 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…