Movie News

దసరా సంక్రాంతి బోత్ ఆర్ నాట్ సేమ్

ఎప్పుడూ లేనిది ఈసారి దసరా పండక్కు సంక్రాంతి రేంజ్ లో మూడు పెద్ద సినిమాలు వచ్చేసరికి రాబోయే సంవత్సరాల్లో ఇది కూడా చాలా కీలక సీజన్ కాబోతోందని నిర్మాతలు అంచనా వేశారు. అయితే అఖండలో బాలయ్య స్టైల్ లో చెప్పాలంటే బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఋజువైపోయింది. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఇదే మూవీ ఒకవేళ జనవరిలో వచ్చి ఉంటే వసూళ్లలో ఎంతలేదన్నా ఇంకో పది ఇరవై కోట్లు పెరుగుదల ఉండేదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యామిలీ ప్లస్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కాబట్టి ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చేవన్న మాట వాస్తవమే.

అదే విధంగా లియో కనక ఇంకొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకుని స్టడీగా ఉంటే మరో పది కోట్లు సులభంగా వచ్చి పడేవి. టైగర్ నాగేశ్వరరావు సైతం పోటీ వల్ల నలిగిపోయిందే. రెండు పండగల స్టామినా ఒకటే కాదని చెప్పేందుకు ప్రధాన కారణం చూసుకుంటే సంక్రాంతి లాగా దసరాకు అందరూ స్వంత ఊళ్లకు వెళ్ళిపోరు. పైగా స్కూళ్లకు కాలేజీలకు తప్ప సంస్థలకు సుదీర్ఘ సెలవులు ఉండవు. హైదరాబాద్ లో జనవరి మధ్యలో రోడ్లు నిర్మానుషంగా ఉంటాయి. అలాంటి సీన్ విజయదశమికి భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. కాబట్టి పోటీ పరంగా దసరాకు రిస్క్ చేయకపోవడం సేఫ్.

ఇకపై ఇలా కాంపిటీషన్ కు వెళ్తున్నప్పుడు నిర్మాతలు ప్రాక్టికల్ గా ఆలోచించుకోవడం అవసరం. అందుకే 2024 సంక్రాంతికి హీరోలు నిర్మాతలు అంతగా పోటీ పడుతున్నారు. ఓపెనింగ్స్ మీద ప్రభావం ఉంటుందని తెలిసినా సరే మాములు రోజుల్లో కంటే ఈ టైంలో వచ్చే కలెక్షన్లు తమను హిట్ అయినా ఫ్లాప్ అయినా గట్టెక్కిస్తాయన్న నమ్మకంతో రిస్క్ చేస్తున్నారు. మనకు బోనస్ ఏంటంటే తమిళనాడులో పొంగల్ ని టార్గెట్ చేసుకున్న అయలన్, లాల్ సలామ్ లకు సైతం థియేటర్లు పంచాల్సిందే. రాబోయే రోజుల్లో తిరుమల గుడిలో ప్రత్యేక సేవలకు రెండేళ్ల ముందే టికెట్లు బుక్ చేసుకున్నట్టు సంక్రాంతి కోసం నిర్మాతలు అలా ఎగబడాల్సి రావొచ్చు

This post was last modified on November 6, 2023 4:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

3 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

4 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

5 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

8 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

8 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

8 hours ago