అదేం నిర్లక్ష్యమో కానీ హీరో హీరోయిన్లకు ఎంతో కొంత పాపులారిటీ ఉందనే కారణంతో కొందరు ప్రొడ్యూసర్లు పూర్తి చేయని సినిమాలను విడుదల చేసేందుకు తెగబడుతున్నారు. మొన్న శుక్రవారం బాలీవుడ్ మూవీ ది లేడీ కిల్లర్ రిలీజయ్యింది. ఎవరో అనామకులు నటించిందంటే ఏమో అనుకోవచ్చు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్, ఈ మధ్య మంచి ఛాన్సులు హిట్లు కొట్టేస్తున్న భూమి పెడ్నేకర్ జంటగా అజయ్ బహ్ల్ దర్శకత్వంలో చాలా చీప్ బడ్జెట్ లో రూపొందించారు. ట్విస్ట్ ఏంటంటే షూటింగ్ కాకుండానే థియేటర్లకు వదిలేంత సాహసం చేశారు.
నిర్మాత చేతుల్లో డబ్బులు లేకపోవడంతో ఏదైతే అదయ్యిందని దొరికిన కాసిన్ని స్క్రీన్లలో విడుదల చేస్తే మొదటి రోజు కేవలం 293 టికెట్లు అమ్ముడుపోయి అక్షరాలా 38 వేల రూపాయిల కలెక్షన్ వచ్చింది. ఇది దేశం మొత్తం మీద వచ్చిన సొమ్ము. అంటే ఎక్కడో మారుమూల పల్లెటూరిలో యాభై రోజులు దాటిన జవాన్ థియేటర్ లో ఒక్క షోకు వచ్చే లెక్క కన్నా తక్కువన్న మాట. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. స్వర్గీయ శ్రీదేవి, బాబాయ్ అనిల్ కపూర్, సోదరి సోనమ్ కపూర్, తండ్రి బోనీ కపూర్ ఇంత పెద్ద స్టార్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోకి ఇది దుస్థితి.
ఇంత కక్కుర్తిపడి ఎందుకు రిలీజ్ చేశారయ్యా అంటే టీమ్ చెప్పే కారణాలు పరమ విచిత్రంగా ఉన్నాయి. బాలన్స్ ఉన్న పది శాతం ఉత్తరాఖండ్ లో తీయాల్సి ఉందట. అయితే అక్కడ భారీ వర్షాలు కురవడంతో వేరే గతి లేక అప్పటిదాకా తీసిన ఫుటేజ్ ని అతుకుల బొంత లాగా జుట్టేసి ఇక మీ ఖర్మ అంటూ జనాల మీదకు వదిలేశారు. టైటిల్ లో ఉన్న లేడీ కిల్లర్ కాస్తా నమ్ముకుని వచ్చిన ప్రేక్షకులను చంపేసింది. కనీసం సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసేందుకు కూడా వెనుకాడారంటే సదరు మేకర్స్ కి దీని మీద ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. మలైకా అరోరా ప్రేమలో పడ్డాక అర్జున్ కపూర్ కెరీర్ నాశనం చేసుకున్నాడని ఫ్యాన్స్ ఆవేదన.
This post was last modified on November 5, 2023 5:44 pm
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…