మొన్న గురువారం వరకు కొత్త సినిమాల అంచనాల విషయంలో కీడా కోలానే ముందున్న మాట వాస్తవం. తరుణ్ భాస్కర్ బ్రాండ్, సురేష్ సంస్థ తరఫున ప్రమోషన్ వ్యవహారాలు రానా దగ్గరుండి చూసుకోవడం, ముందు రోజే ప్రీమియర్లు వేయడం ఓపెనింగ్స్ పరంగా ప్లస్ అయ్యాయి. అయితే ఓటిటి మూవీకి కొనసాగింపుగా వచ్చిన మా ఊరి పొలిమేర 2 మీద ప్రీ రిలీజ్ బజ్ బాగానే ఉండింది కానీ మరీ డామినేట్ చేస్తుందనే స్థాయిలో ఊహించలేదు. పైగా టాక్, రివ్యూలు దీనికీ డివైడ్ గానే వచ్చాయి. కానీ చేతబడి కాన్సెప్ట్ జనాలకు కనెక్ట్ అయిపోయింది. అది వసూళ్లలో కనిపిస్తోంది.
కోలా మీద కొమిరి(సత్యం రాజేష్ పాత్ర పేరు) దెబ్బ ఎలా పడిందో ఇది చూస్తే అర్థమైపోతుంది. రెండు రోజులకు గాను కీడా కోలాకు బుక్ మై షోలో అమ్ముడుపోయిన టికెట్లు 75 వేలు. మా ఊరి పొలిమేర 2కి అదే యాప్ లో కొనుగోలు చేసిన ఆడియన్స్ 1 లక్ష 14 వేల 770. ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. నేరుగా కౌంటర్లో జరిగే సేల్స్ ని కొలమానంగా తీసుకున్నా పొలిమేర ఉన్నంత స్పీడ్ లో కీడా కోలా లేదు. క్రేజీ కామెడీని యూత్ ఓ మోస్తరుగా ఎంజాయ్ చేస్తున్నా ఫ్యామిలీ జనాలకు ఎక్కడం లేదు. మాస్ కి అవసరం లేని గోలలా తోస్తోంది. దీంతో సహజంగానే పోటీదారుకి ఓటేశారు.
మా ఊరి పొలిమేర 2లోనూ లోటు పాట్లు ఉన్నప్పటికీ ట్విస్టులతో నెట్టుకొచ్చేశారు. పబ్లిక్ టాక్ లో ఇవి కీలక పాత్ర పోషించాయి. మొదటి రోజు గ్రాస్ 3 కోట్లు కాగా కీడా కోలా 6 కోట్లుగా అఫీషియల్ పోస్టర్లలో వేశారు. అయితే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ మాత్రం వేరుగా ఉన్నాయి. ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇదే జోరు ఎన్ని రోజులు కొనసాగిస్తుందో చెప్పడం కష్టమే. ఒకవేళ సోమవారం నుంచి డ్రాప్ గణనీయంగా తగ్గకపోతే భారీ లాభాలు ఖాయం. అలా జరగకపోయినా పోయినా సరే మా ఊరి పొలిమేర 2 బ్రేక్ ఈవెన్ దాటిపోయి ప్రాఫిట్ జోన్ లోకి ప్రవేశించడం పక్కా. ఫైనల్ స్టేటస్ వచ్చే వారం తేలుతుంది.
This post was last modified on November 10, 2023 4:12 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…