దీపావళి లాంటి మంచి పండుగ సీజన్‌ను మన వాళ్లు ఎప్పుడూ పెద్దగా ఉపయోగించుకున్నది లేదు. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు. ప్రతిసారీ ఏదో ఒక మిడ్ రేంజ్ సినిమా అయినా ఉండేది కానీ.. ఈ ఏడాది మరీ దారుణంగా తెలుగు నుంచి అసలు రిలీజే లేకుండా పోయింది. డబ్బింగ్ సినిమాలే ఈ పండక్కి హవా సాగించబోతున్నాయి. తమిళ అనువాదాలు జపాన్, జిగర్‌తండా డబులెక్స్.. హిందీ డబ్బింగ్ మూవీ టైగర్-3 దీపావళికి తెలుగు రాష్ట్రాల థియేటర్లను ముంచెత్తబోతున్నాయి.
ఈ మూడు చిత్రాలకూ భారీగానే థియేటర్లు ఇవ్వబోతున్నారు. అవి మంచి వసూళ్లు కూడా సాధించే అవకాశాలున్నాయి. తెలుగు సినిమాలు లేవన్న మాటే కానీ.. తెలుగు నిర్మాతలకు దీపావళి సినిమాల్లో స్టేక్స్ లేకుండా ఏమీ లేదు. కార్తి సినిమా జపాన్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ మీద రిలీజ్ చేయబోతున్నారు. కార్తితో ఊపిరి సినిమా చేసినప్పటి నుంచి అతడితో నాగ్ అనుబంధం కొనసాగుతోంది. కార్తి చివరి సినిమా సర్దార్‌ను కూడా అన్నపూర్ణ బేనర్ మీదే రిలీజ్ చేశారు. జపాన్ మీద మంచి అంచనాలుండటంతో ఓపెనింగ్స్ బాగానే వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇక కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో లారెన్స్, ఎస్.జె.సూర్య నటించిన జిగర్ తండా డబులెక్స్‌కు కూడా తెలుగులో కొంత క్రేజ్ ఉంది. ఈ చిత్రాన్ని సురేష్ బాబు, ఏషియన్ సునీల్ కలిసి రిలీజ్ చేస్తుండటం విశేషం. ప్రోమోలు బాగున్నాయి కాబట్టి దీనికి కూడా మంచి ఓపెనింగ్స్ రావచ్చు. ఇక టైగర్-3 విషయానికి వస్తే యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు సినిమాను ఇక్కడి వాళ్లకేమీ అమ్మలేదు. కానీ దిల్ రాజు లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ల భాగస్వామ్యంతో తెలుగులో పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి అనువాద సినిమాల మీద పెద్ద పెద్దోళ్లే చేతులు వేశారన్నమాట.
This post was last modified on November 5, 2023 1:59 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…