దీపావళికి తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాలతోనే సర్దుకోవాల్సి వచ్చేలా ఉంది. తమిళం నుంచి రెండు, హిందీ నుంచి ఒకటి ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేయబోతున్నాయి. అందులో ఒకటి జిగర్ తండా డబుల్ ఎక్స్, గద్దలకొండ గణేష్ ఒరిజినల్ వెర్షన్ కు కొనసాగింపు ఇది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈసారి రీమేక్ ఛాన్స్ ఇవ్వకుండా ఒకేసారి అనువాద రూపంలోనూ తెస్తున్నారు. గత కొంత కాలంగా టాలీవుడ్ లో వరస డిజాస్టర్లతో మార్కెట్ తగ్గించుకున్న లారెన్స్ హీరోగా రూపొందిన ఈ వెరైటీ డ్రామాలో ఎస్జె సూర్య ఇంకో కీలక పాత్ర పోషించారు. ఇందాకా ట్రైలర్ లాంచ్ జరిగింది.
ఇది ఇప్పటి కథ కాదు. దశాబ్దాల క్రితం జరిగింది. హీరో అంటే తెల్లగానే ఎందుకు ఉండాలని నల్లగా ఉన్నవాడితో హిట్టు కొడతానని శపథం చేస్తాడు డైరెక్టర్(ఎస్జె సూర్య). దానికోసం మాఫియా దందాలు చేసే ఒక రౌడీ(లారెన్స్ రాఘవేంద్ర)ని వెతికి పట్టుకుంటాడు. నటించడమంటే సరదా ఉన్న అతగాడు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇక్కడి దాకా బాగానే ఉన్నా హీరోతో సంబంధం ఉన్న ఓ రాజకీయ నాయకుడి (షైన్ టామ్ చాకో)తో పాటు పోలీస్ ఆఫీసర్(నవీన్ చంద్ర)తో ప్రమాదకరమైన ఆట మొదలవుతుంది. ఇంతకీ సినిమా తీశారా లేక ఇంకేదైనా చేశారా తెరమీద చూడాలి.
విజువల్స్ అన్నీ కార్తీకి సుబ్బరాజు స్టైల్ లో ఉన్నాయి. బ్యాక్ డ్రాప్ చాలా డిఫరెంట్ గా సెట్ చేసుకున్నారు. కథ పరంగా జిగర్ తండా 1 లైన్ లోనే వెళ్లినప్పటికీ ఇంటెన్స్ పరంగా కామెడీతో పాటు చాలా సీరియస్ అంశాలు కూడా జొప్పించారు. హీరోయిన్ లేదు. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తిరునావుక్కరసు ఛాయాగ్రహణం మంచి క్వాలిటీకి దోహదపడ్డాయి. చూసేందుకు ఆసక్తికరంగానే ఉంది కానీ 2 గంటల 52 నిమిషాల పాటు ఎంగేజ్ చేసేంత హెవీ కంటెంట్ ఇందులో ఏముందో చూడాలి. నవంబర్ 10న కార్తీ జపాన్, 12న సల్మాన్ ఖాన్ టైగర్ 3తో జిగర్ తండా డబుల్ ఎక్స్ పోటీపడనుంది.
This post was last modified on November 4, 2023 11:22 pm
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…