‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఇమేజ్ ఏ స్థాయికి వెళ్లిందో తెలిసిందే. ఆ ఇమేజ్‌కు తగ్గట్లే ఏస్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా సెట్ చేసుకోవడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. చిరంజీవి సహా ఎంతోమంది టాలీవుడ్ టాప్ స్టార్లు శంకర్‌తో జట్టు కట్టాలని ఆశపడ్డారు. కానీ వాళ్లెవ్వరికీ దక్కని అదృష్టం చరణ్‌కు దక్కిందని సంబరపడ్డారు. ‘రోబో’ తర్వాత శంకర్ నుంచి ఆయన స్థాయి సినిమా రాకపోయినా సరే.. చరణ్‌తో ఆయన ఒక బ్లాక్‌బస్టర్ సినిమా తీస్తాడనే ఆశించారు.
కానీ ఏ ముహూర్తాన ‘గేమ్ చేంజర్’ సినిమా మొదలైందో కానీ.. మూడేళ్లకు కూడా పూర్తి కాని పరిస్థితి. ఈ సినిమా షూటింగ్‌కు ఎన్నిసార్లు బ్రేకులు పడ్డాయో, ఎంత ఆలస్యం జరుగుతోందో తెలిసిందే. ఐతే ఆలస్యమైతే అయ్యింది ఈ కాంబినేషన్ క్రేజ్‌కు తగ్గ సినిమా వస్తే చాలు అనుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు ఆ విషయంలోనూ సందేహాలు నెలకొంటున్నాయి.
‘గేమ్ చేంజర్’ను హోల్డ్ చేసి.. శంకర్ పూర్తి చేసిన ‘ఇండియన్-2’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీని టీజర్‌ను నిన్నే లాంచ్ చేశారు. అది చూస్తే శంకర్ తన టచ్ కోల్పోయాడా అన్న సందేహాలు కలిగాయి. ఇందులో విజువల్స్ రిచ్‌గా అనిపించాయే తప్ప కంటెంట్ ఎగ్జైటింగ్‌గా మాత్రం లేదు. బోలెడంతమంది నటీనటులు.. రిచ్ లొకేషన్లు.. ప్రతి ఫ్రేమ్‌లోనూ భారీతనం కనిపించిందే తప్ప.. వావ్ అనిపించే మూమెంట్ ఏదీ అందులో లేదు.
భారతీయుడి పునరాగమనం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని తీసుకురాలేకపోయింది. ఇంట్రో టీజర్‌ను బట్టి ఒక అంచనాకు వచ్చేయలేం కానీ.. రెండు నిమిషాల నిడివిలో శంకర్ మార్కు మెరుపులు లేకపోవడం మాత్రం ఆయన పనితనం మీద సందేహాలు రేకెత్తించింది. దీంతో చరణ్ అభిమానుల్లో ఒక రకమైన కలవరం మొదలైంది. ‘గేమ్ చేంజర్’ పరిస్థితి ఏమవుతుందో.. శంకర్ ఇదే స్టయిల్లో ఆ సినిమాను కూడా లాగించేస్తుంటే ఏంటి పరిస్థితి అని వాళ్లు కంగారు పడుతున్నారు.
This post was last modified on November 4, 2023 10:29 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…