ఓవర్ ద టాప్ ఫ్లాట్ ఫామ్ అంటే చాలా భారీ స్థాయి వ్యవహారం అనే అభిప్రాయం ఉంది. దాని కోసం సినిమాలు కొనడం.. ఒరిజినల్స్ ప్రొడ్యూస్ చేయడం.. డీల్స్ చేయడం ఇదంతా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంలాగే కనిపిస్తుంది. దీన్ని మేనేజ్ చేయడం నిర్మాతల స్థాయిలో ఉన్న వారికి శక్తికి మించిన భారం అన్నది వాస్తవం. ఐతే టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్.. ‘ఆహా’ పేరుతో ఓటీటీ పెట్టి దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు.
ముందు దీని సక్సెస్ మీద సందేహాలు కలిగాయి కానీ.. నెమ్మదిగా ప్రయాణం మొదలుపెట్టి ఆ ఓటీటీని ఒక స్థాయిలో నిలబెట్టగలిగారు. ఇప్పటికీ ఆదాయం కంటే పెట్టుబడే ఎక్కువ అయినప్పటికీ.. భవిష్యత్తులో మంచి లాభం వస్తుందని అంచనా వేస్తున్నారు. ‘ఆహా’ జర్నీ చూసి ఇన్‌స్పైర్ అయ్యారో ఏమో కానీ.. మరో అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం ఓటీటీ వ్యాపారంలోకి దిగుతున్నట్లు సమాచారం.
రాజు నుంచి త్వరలోనే ఒక ఓటీటీ రాబోతోందట. దాని కోసం కంటెంట్ క్రియేషన్ మీద ఇప్పుడు ఆయన దృష్టిసారించినట్లు సమాచారం. ఒక బడ్జెట్ పెట్టి దాదాపు 25 చిన్న సినిమాలను నిర్మించే ప్రయత్నంలో రాజు ఉన్నారట. ఇందుకోసం ఆయనతో మరికొందరు నిర్మాతలు కూడా చేతులు కలుపుతున్నారట. ఒక్కరే భారీ పెట్టుబడి అంటే కష్టమవుతుంది. అందుకే తలో చేయి వస్తున్నట్లు సమాచారం.
దిల్ రాజు ముందుండి తన ప్లానింగ్‌తో దీన్ని నడిపిస్తారు. రాజు స్వయంగా 60 దాకా సినిమాలు నిర్మించాడు. మున్ముందు ఆయన్నుంచి మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. వీటికి తోడు వేరే సినిమాలు కూడా కొన్ని కొంటే కంటెంట్ ఓ మోస్తరుగా రెడీ అవుతుంది. ఐతే ఓటీటీ అంటే నిరంతరం కొత్త కంటెంట్ ఇస్తూనే ఉండాలి. భారీగా పెట్టుబడి పెట్టి నడిపించాలి. ఇది సవాలుతో కూడుకున్న విషయమే.. రాజు తన ప్లానింగ్‌తో దీన్ని సక్సెస్ చేయగలడని చెప్పొచ్చు.
This post was last modified on November 4, 2023 7:38 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…