స్కంద ఓటిటిలో వచ్చాక ఒకపక్క జవాన్ పోటీని తట్టుకుని మరీ భారీ వ్యూస్ తో హాట్ స్టార్ లో దూసుకుపోతూ ఉండగా ఇంకోపక్క కంటెంట్ మీద కామెంట్ల వర్షం కురుస్తూనే ఉంది. ట్రోలింగ్ సంగతి పక్కనపెడితే ఒక ఫైట్ సీక్వెన్స్ లో రామ్ రౌడీలను ఎదురుకునే క్రమంలో దీపపు సమ్మెలను పట్టుకుని వాళ్ళను గాల్లో లేపుతాడు. కేవలం సెకనులో సెకను భాగం మాత్రమే అనిపించే ఒక షాట్ లో రామ్ కి బాడీ డబుల్ గా బోయపాటి శీను కనిపిస్తాడు. దీన్ని నెటిజెన్లు పసిగట్టేసి స్క్రీన్ షాట్స్ తో సహా దాన్ని ట్వీట్ చేశారు. దీని మీద లెక్కలేనన్ని మీమ్స్ ట్విట్టర్ లో హల్చల్ చేశాయి.
ఈ విషయం పట్ల రామ్ స్పందిన ఇలా ఉంది. ఏప్రిల్ 22న విపరీతమైన ఎండల మధ్య పాతిక రోజుల పాటు నిరంతర యాక్షన్ షెడ్యూల్ లో భాగమయ్యాను. అదింకా మూడో రోజే. సరిగా నడవలేని పరిస్థితి వచ్చింది. విపరీతంగా రక్త స్రావం కావడంతో కాస్త విశ్రాంతి కోసం పక్కకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో నా దర్శకుడు ఆ షాట్ లోకి వెళ్ళిపోయి నా కోసం దాంట్లో స్వయంగా పాల్గొని చిత్రీకరించారు. నచ్చడం నచ్చకపోవడం ఆడియన్స్ ఛాయస్. మీ అభిప్రాయాలకు ఎప్పుడూ విలువ ఉంటుంది. ఇదంతా మీ కోసమే. నా దర్శకుడి పట్ల గౌరవం తగ్గదు. ఇలాగే చెమటని రక్తాన్ని చిందించడం ఆపను అంచనాలు సున్నా ఉన్నా సరే.
మొత్తానికి రామ్ రెస్పాండ్ అయిన తీరు అభిమానులను కదిలిస్తోంది. స్కందకే కాదు వినయ విధేయ రామ టైంలోనూ బోయపాటి ఇలాంటి విమర్శలను సోషల్ మీడియా వేదికగా చవి చూడాల్సి వచ్చింది. స్కంద ఓటిటిలో వచ్చాక అదే సీన్ రిపీట్ అయ్యింది. ఒకవేళ అఖండ రేంజ్ లో కంటెంట్ కనక కనెక్ట్ అయ్యుంటే ఇప్పుడీ లాజిక్స్ అన్నీ మేజిక్స్ గా మారిపోయేవి. కానీ రాతలో వైఫల్యం కాస్తా తీతని తేడాగా మార్చేసింది. అయినా జరిగిపోయిన దాన్ని వదిలేయకుండా రామ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం మంచిదే. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చేస్తున్న రామ్ దీనికి కూడా అంతే కష్టపడాల్సి వస్తోంది.
This post was last modified on November 4, 2023 7:33 pm
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…