పఠాన్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో పావు గంట సేపు అది కూడా ఒక అదిరిపోయే ట్రైన్ ఫైట్ లో కనిపిస్తేనే థియేటర్లు మోతెక్కిపోయాయి. ఆ సినిమా సక్సెస్ లో ఈ ఎపిసోడ్ షేర్ ని తక్కువ చేసి చెప్పలేం. అంత గొప్పగా తెరమీద పండింది. దానికి బాద్షా ఋణం తీర్చుకుంటూ టైగర్ 3లో స్పెషల్ క్యామియో చేస్తున్న సంగతి అల్రెడీ లీకైపోయింది. టెర్రిఫిక్ అనిపించే ఒక యాక్షన్ ఛేజ్ లో ఇద్దరూ కలిసి షోలే బైకు మీద రోడ్ల మీద పరుగులు పెడుతూ ఆ తర్వాత రకరకాల విన్యాసాలతో విలన్ ఇమ్రాన్ ఆష్మి గ్యాంగ్ కి ముచ్చెమటలు పట్టిస్తారట. ఓ రేంజ్ లో పేలుతుందని టాక్.
దీనికే ఇలా అనిపిస్తే ఇప్పుడు వీళ్లకు హృతిక్ రోషన్ తోడైతే ఎలా ఉంటుంది. సీక్రెట్ గా దాచడానికి విశ్వప్రయత్నం చేశారు కానీ టైగర్ 3లో అతను ఉండటం కన్ఫర్మ్ అని ముంబై మీడియా టాక్. ఎక్కువసేపు కాకపోయినా కనిపించే కనిపించే కాసేపు ఎవరూ కుర్చీలలో కూర్చోలేరని యూనిట్ సభ్యులు ఊరిస్తున్నారు. టైగర్ జిందా హై, వార్, పఠాన్ లను కలుపుతూ స్పై యూనివర్స్ సృష్టిస్తున్న యష్ రాజ్ సంస్థ అందులో భాగంగానే ఈ అపూర్వ కలయికను సెట్ చేసిందట. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 రిలీజయ్యాక ఈ బ్యాచ్ లో తోడవుతాడు. నెక్స్ట్ వచ్చే సిరీస్ లో తననీ చూడొచ్చు.
రోజులు దగ్గరపడే కొద్దీ టైగర్ 3 మీద అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధిస్తుందని ఇప్పటికే లెక్కలు కడుతున్నారు. దానికి తోడు ఇలాంటి లీకులు అంతకంతా హైప్ ని పెంచుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 25 విడుదల కాబోతున్న ఫైటర్ ఒకటే ఈ స్పై యూనివర్స్ కి దూరంగా డిఫరెంట్ సబ్జెక్టుతో వస్తుంది. ఆ తర్వాత టైగర్ వర్సెస్ పఠాన్ లో షారుఖ్, సల్మాన్ ఇద్దరూ ఫుల్ లెన్త్ రోల్స్ చేయనుండగా దాంట్లో స్పై హీరోలందరూ చేతులు కలిపే అవకాశముంది. నవంబర్ 12 టైగర్ 3 తెలుగు వెర్షన్ ని సైతం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
This post was last modified on November 4, 2023 6:32 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…