శాండల్ వుడ్ సీనియర్ మోస్ట్ హీరో శివరాజ్ కుమార్ కు తెలుగులో ముందు నుంచి మార్కెట్ లేదు. ఆయన నటించిన ఓం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇక్కడ రీమేక్ కావడంతో ఎక్కువ డబ్బింగ్ చూసే ఛాన్స్ దక్కలేదు. కన్నడనాట మాత్రం తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ లెజెండరీ స్టార్ మన ఆడియన్స్ కి దగ్గరయింది మాత్రం జైలర్ లో చేసిన చిన్న పాత్ర వల్లే. నరసింహా క్యారెక్టర్ లో రజినీకాంత్ కుటుంబాన్ని కాపాడే బాధ్యత తీసుకునే స్నేహితుడిగా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. క్లైమాక్స్ లో కనిపించేది కొన్ని నిమిషాలే అయినా ఆ ఇంపాక్ట్ చాలా బలంగా ఉండిపోయింది.
అందుకే ఈయన కొత్త ప్యాన్ ఇండియా మూవీ ఘోస్ట్ ని ఇవాళ థియేటర్లలో విడుదల చేశారు. నిజానికిది అక్టోబర్ 20న దసరా పండగ సందర్భంగా కన్నడలో రిలీజయ్యింది. కానీ మనదగ్గర భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావుల పోటీ ఉండటంతో డ్రాప్ చేశారు. తీరా చూస్తే అక్కడేమి అదిరిపోయే బ్లాక్ బస్టర్ కాలేదు. భారీగా తీశారు కానీ ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. అయినా సరే శివన్న ఇమేజ్ సహాయంతో నిర్మాతలు బాగానే రికవర్ చేసుకున్నారు. అలాంటి యావరేజ్ కంటెంట్ ఎంత రిచ్ గా ఉన్నా సరే తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం కష్టమే.
ఘోస్ట్ కి కనీస స్థాయిలో బజ్ లేదు. హక్కులు కొన్న నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ లాంటి కార్యక్రమాలు చేయలేదు. దీనికన్నా ముందు వేదాకు బాలకృష్ణని గెస్టుగా తీసుకొచ్చి మరీ శివరాజ్ కుమార్ ప్రమోషన్ లో భాగమయ్యాడు. కానీ ఘోస్ట్ విషయంలో అంత ఆసక్తి చూపించలేదు. కారణం రెండు వారాలు దాటడమేనని ఇన్ సైడ్ టాక్. ఒకపక్క మా ఊరి పొలిమేర 2 ఊపందుకుంటోంది. కీడా కోలా టాక్ ఎలా ఉన్నా క్రేజ్ తో వీకెండ్ వరకు బాగానే వెళ్లేలా ఉంది. ఎటొచ్చి ఘోస్ట్ ని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. మరి ఏమైనా సర్ప్రైజ్ టాక్ వచ్చి అమాంతం జనాన్ని రప్పిస్తుందేమో చూడాలి. ఇది జరిగే పనేనా.
This post was last modified on November 4, 2023 3:10 pm
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్కు న్యూజిలాండ్ షాక్…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…
తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం…
సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ..…
తాను మరో పాదయాత్ర చేయబోతున్నానని ఏపీ మాజీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి…