Movie News

బ్రహ్మానందంని వాడుకునే తీరు ఇదేనా

లెజెండరీ కమెడియన్ అనే మాట బ్రహ్మానందం గారికి చాలా చిన్నది. వర్తమానంలోనే కాదు భవిష్యత్తులోనూ ఎవరికీ సాధ్యం కాదనిపించే వెయ్యికి పైగా సినిమాల మైలురాయిని అందుకున్నారు. ఇప్పటికీ షూటింగులకు, సభలకు మంచి ఉత్సాహంతో ఉన్న తొణికిసలాడే ఆయన్ని చూస్తే ఎవరికైనా హుషారు వచ్చేస్తుంది. వయసు దృష్ట్యా అన్ని పాత్రలు ఒప్పుకోకపోయినా నచ్చినవి మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు. రంగ మార్తాండలో ఏడిపించే వేషమే అయినా ప్రకాష్ రాజ్ తో పోటీ పడి మరీ కన్నీళ్లు తెప్పించారు. జాతిరత్నాలులో కనిపించేది అయిదు నిమిషాలే. కానీ జడ్జ్ గా ఆ కాసేపు చక్కిలిగింతలు పెట్టేశారు.

కీడా కోలాలో బ్రహ్మానందం ఉన్నారని తెలియగానే అభిమానులు తెగ సంబరపడ్డారు. కొత్త ఆర్టిస్టులతోనే అద్భుతమైన అవుట్ ఫుట్ రాబట్టుకునే దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈసారి ఏ రేంజ్ లో తమ అభిమాన హాస్య నటుడిని చూపిస్తారోనని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు. తీరా చూస్తే వీల్ చైర్ కి పరిమితమై, అతి కొద్ది డైలాగులు పెట్టి, తక్కువ ఎక్స్ ప్రెషన్లతో పెద్దగా వాడుకోలేపోవడం నిరాశ పరిచింది. దానికి చోటు చక్రాల కుర్చీకి ఆయన జబ్బుని ముడిపెట్టి ఏదో కామెడీ చేయించబోయారు కానీ అది కూడా ఏమంత పండలేదు. తరుణ్ భాస్కర్ సరైన ఎపిసోడ్స్ రాసుకోవడంలో తడబడ్డాడు.

ఏదైతేనేం టాక్ అయితే డివైడ్ గా వచ్చేసింది. వీకెండ్ అయ్యాక ఫైనల్ గా కీడా కోలా ఫ్లాపు హిట్టుకి మధ్య ఎక్కడ నిలబడుతుందో క్లారిటీ వస్తుంది. ఆరోగ్యం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతున్నా బ్రహ్మానందంలో మునుపటి ఎనర్జీ అలాగే ఉంది. కాకపోతే దాన్ని పిండుకునే కళ తెలియాలి. అను దీప్ కేవలం మూడు డైలాగులతో నవ్వులు పండించాడుగా. అయినా స్క్రీన్ మొత్తం కుర్ర ఆర్టిస్టులతో నిండిపోయిన కీడా కోలాలో మోస్ట్ సీనియర్ కి ప్రాధాన్యం తగ్గడం నిరాశ పరిచినా ఆయన మీద ఇంకా ఎలాంటి పాత్రలు రాసుకోవచ్చో ఇతర దర్శకులకు క్లారిటీ వచ్చింది. ఆ దిశగా ఎవరైనా చొరవ తీసుకుంటారేమో చూడాలి. 

This post was last modified on November 4, 2023 12:13 pm

Share

Recent Posts

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

13 minutes ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

5 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

12 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

13 hours ago