తరుణ్ భాస్కర్ అంటే ప్రధానంగా దర్శకుడిగానే గుర్తింపు ఉండేది ఇన్నాళ్లూ. తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో అతను ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. ఆ చిత్రం తెలుగుల్లోకి ఒక తాజాదనం తీసుకొచ్చింది. ఆ సినిమా ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ దక్కిచుకోవడంతో పాటు అవార్డులు కూడా గెలుచుకుంది. తరుణ్ రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ సైతం యూత్‌ను బాగా ఆకట్టుకుంది. దీంతో దర్శకుడిగా తరుణ్ ఒక స్థాయిలో నిలబడ్డాడు.
ఆ తర్వాత తరుణ్ భాస్కర్ నటుడిగా ‘మీకు మాత్రమే చెప్తా’లో లీడ్ రోల్ చేయడమే కాక సహా పలు చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేశాడు. నటుడిగా కూడా అతను మెప్పించినప్పటికీ.. దర్శకుడిగానే తరుణ్‌కు ఫ్యాన్స్ ఎక్కువ. కానీ ‘కీడా కోలా’తో మాత్రం సీన్ మారిపోయింది. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించడమే కాక ఇందులో నాయుడు అనే కీలక పాత్ర కూడా పోషించాడు తరుణ్.
ఐతే ‘కీడా కోలా’లో దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను నటుడు తరుణ్ భాస్కర్ పూర్తిగా డామినేట్ చేశాడు. ‘కీడా కోలా’లో పేరుకు చైతన్యరావు హీరో కానీ.. సినిమాను భుజాల మీద నడిపించింది మాత్రం తరుణే. సినిమాలో నాయుడి పాత్ర రంగ ప్రవేశం తర్వాతే ఎంటర్టైన్మెంట్ డోస్ మొదలవుతుంది. కథనం ఊపందుకుంటుంది. తెరపై తరుణ్ కనిపించిన ప్రతిసారీ నవ్వులకు ఢోకా లేదు. మంచి ఎలివేషన్ సీన్లు కూడా పడటంతో ఈ పాత్రకు థియేటర్లలో అదిరిపోయే స్పందన వస్తోంది.
ఎలాంటి హడావుడి లేకుండా సటిల్ యాక్టింగ్‌తో, సింపుల్ ఎక్స్‌ప్రెషన్లతోనే తరుణ్ మంచి కామెడీ పండించాడు. నటుడిగా సినిమాలో అతను షో స్టీలర్ అనడంలో సందేహం లేదు. ఐతే యాక్టర్‌గా ఇంత మెప్పించిన తరుణ్.. రైటర్ కమ్ డైరెక్టర్‌గా మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. సినిమాలో కొన్ని కామెడీ సీన్లు భలేగా పేలాయి కానీ.. ఇంకా బలమైన కథ.. బిగి ఉన్న కథనం తోడై ఉంటే సినిమా వేరే స్థాయిలో నిలబడేది. అవి లేక ‘యావరేజ్’ అనిపించుకుంటోంది.
This post was last modified on November 4, 2023 9:21 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…