ఈ ఏడాది అత్యధిక అంచనాలతో రాబోతున్న సినిమా అంటే సలార్‌యే. సెప్టెంబరు 28నే రావాల్సిన ఈ భారీ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం వల్ల క్రిస్మస్‌కు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. డిసెంబరు 22న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇంకా టీం అయితే ప్రమోషన్ల హడావుడి ఏమీ మొదలుపెట్టలేదు. కాగా సలార్‌లో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రుతి హాసన్ ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా సలార్‌ను ప్రభాస్ సినిమాగా ప్రమోట్ చేయడం మీకు ఇబ్బందిగా అనిపించదా అంటూ రిపోర్టర్ ఆమెను గిల్లే ప్రయత్నం చేసింది.
దీనికి శ్రుతి ఇచ్చిన సమాధానం ప్రభాస్ అభిమానులనే కాక అందరినీ ఆకట్టుకుంటోంటి. అందరూ సలార్‌ను ప్రభాస్ సినిమా అంటున్నారు.. అందులో మీరు కూడా భాగం కదా అని రిపోర్టర్ అడిగితే.. కచ్చితంగా అది ప్రభాస్ సినిమానే అందులో ఇబ్బంది ఏముంది అని శ్రుతి ప్రశ్నించింది. సలార్ ఎవరి కథ అనేది ముఖ్యమని.. అది శ్రుతి కథ కాదని, ప్రభాస్ కథే అని ఆమె అంది. ముందు నుంచి సినిమాను ప్రమోట్ చేయడం కూడా ప్రభాస్ సినిమాగానే చేశారని శ్రుతి పేర్కొంది. ప్రభాస్ తన కెరీర్‌ను నిర్మించుకోవడానికి ఎంత కష్టపడ్డాడు.. ప్రశాంత్ నీల్ తన కెరీర్ కోసం ఎంత శ్రమించాడు అన్నది చూడాలని శ్రుతి చెప్పింది.
మీరు కూడా కెరీర్ కోసం కష్టపడ్డారు కదా అంటే.. అది వాస్తవమే అయినప్పటికీ సలార్ కచ్చితంగా ప్రభాస్ సినిమానే అని.. అందులో తాను భాగం అని.. ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి తనకేమీ ఇబ్బంది లేదని శ్రుతి స్పష్టం చేసింది. కల్కి సినిమాను ప్రభాస్ పేరు మీద ప్రమోట్ చేయడాన్ని అప్పట్లో దీపికా పదుకొనే తప్పుబడుతూ సోషల్ మీడియాలో చేసిన కామెంట్ వైరల్ అయింది. కానీ శ్రుతి మాత్రం అందుకు భిన్నంగా స్పందించి ప్రభాస్ ఫ్యాన్స్ మనసు దోచింది.
This post was last modified on November 3, 2023 11:24 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…