ఈ వీకెండ్లో పేరుకు అరడజనుకు పైగానే సినిమాలు రిలీజయ్యాయి కానీ.. అందులో ప్రధానంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందైతే కీడా కోలా, మా ఊరి పొలిమేర-2 చిత్రాలే. ఈ రెండు చిత్రాల్లోనూ స్టార్ కాస్ట్ లేకపోయినా సరే.. వీటికి ట్రేడ్ వర్గాల్లోనే కాక ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ వచ్చింది. పెళ్ళిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాల తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అతడి పేరు మీదే కీడా కోలా సేల్ అయింది. దానికి యూత్‌లో మంచి క్రేజ్ వచ్చిందన్నా అందుక్కారణం తరుణే.
ఇక మా ఊరి పొలిమేర సినిమా హాట్ స్టార్ ఓటీటీలో రిలీజై అక్కడ మంచి స్పందన తెచ్చుకోగా.. దానికి కొనసాగింపుగా మంచి బడ్జెట్ పెట్టి మా ఊరి పొలిమేర-2 తీసి థియేటర్లలో రిలీజ్ చేశారు. దీనికి మాస్ ప్రేక్షకుల్లో కొంచెం క్రేజ్ కనిపించింది. శుక్రవారం రిలీజైన ఈ రెండు చిత్రాలకు మరీ మంచి టాకేమీ రాలేదు. రెంటికీ డివైడ్ టాక్ వచ్చింది. కీడాకోలాలో కొన్ని ఫన్ మూమెంట్స్ ఉన్నప్పటికీ కథ మరీ వీక్‌గా ఉండటం, ఒక పూర్తి స్థాయి ఫీచర్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ కలగకపోవడం మైనస్ అయింది.
అయినా సరే.. ఈ రోజు ఉదయం చాలా చోట్ల మార్నింగ్ షోలు ఫుల్ అయ్యాయి. సాయంత్రం షోలకు కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. యూత్ థియేటర్లను కళకళలాడించారు. ఒక స్టార్ హీరో సినిమా రేంజిలో థియేటర్లలో స్పందన కనిపించింది. ముఖ్యంగా తరుణ్ తెరపై కనిపించినపుడు వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. తన క్రేజ్ మీదే సినిమా నడుస్తోంది.
ఇక మా ఊరి పొలిమేర-2ను తక్కువ అంచనా వేసిన వాళ్లంతా ఈ రోజు థియేటర్లలో ఆక్యుపెన్సీలు చూసి షాకయ్యే ఉంటారు. సింగిల్ స్క్రీన్లలో ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ కంటే వాకిన్స్ ద్వారా థియేటర్లు బాగా నిండాయి. ఈ సినిమాలో బోలెడన్ని ట్విస్టులున్నా.. లాజిక్ లెస్‌గా ఉందని, సగటు ప్రేక్షకులు జీర్ణించుకోలేని అంశాలున్నాయని టాక్ వస్తున్నప్పటికీ.. మాస్ ప్రేక్షకులు సినిమా కోసం ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రెండు సినిమాలూ తొలి వీకెండ్ ఓపెనింగ్స్‌తోనే ఈజీగా గట్టెక్కేసేలా కనిపిస్తున్నాయి.
This post was last modified on November 3, 2023 11:19 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…