రీ రిలీజుల ట్రెండ్ మీద జనానికి వెగటు వచ్చేసిందని చెప్పడానికి ఈ మధ్య ప్రత్యక్ష ఉదాహరణలు కనిపిస్తున్నాయి. శంకర్ దాకా ఎంబిబిఎస్ రేపు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే గ్రౌండ్ లెవెల్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవని బయ్యర్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో రెండు మూడు మెయిన్ స్క్రీన్లు తప్ప తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం రెస్పాన్స్ జనాల నాడిని తెలియజేస్తోందని అంటున్నారు. ఏడాది కాలంగా ఇబ్బడిముబ్బడిగా పాత సినిమాలను థియేటర్లలో వదులుతూనే ఉన్నారు. ఒకదశలో కొన్ని కొత్తవాటిని సైతం దెబ్బ తీశాయి కూడా.
క్రమంగా ఇవి ఓవర్ డోస్ కావడంతో ఆ ప్రభావం ఇప్పుడొచ్చే వాటి మీద పడుతోంది. ఆ మధ్య 7జి బృందావన్ కాలనీ ఈ కారణంగా వృథా అయ్యింది. అంత గొప్ప కల్ట్ క్లాసిక్ ని జనం లైట్ తీసుకున్నారు. ఇప్పుడు శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి మెగా మూవీకి ఈ పరిస్థితి రావడం విచారకరం. అయినా ఎంత పబ్లిక్ చూస్తున్నారని కొత్త రేట్లతో ఇంటర్ నెట్ లో ఫ్రీగా దొరికే సినిమాలను మళ్ళీ మళ్ళీ చూపిస్తామంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. ఎగ్జిబిటర్లు కనీసం తగ్గించే దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు సరికదా వదలడానికి ఇంకేం బ్యాలన్స్ ఉన్నాయో ఇరవై ఏళ్ళ హిట్ సినిమాల లిస్టు వెతుకుతున్నారు.
ఇదిక్కడితో అయిపోవడం లేదు. పదిహేడో తారీఖు అదుర్స్ వస్తోంది. సింహాద్రి, బాద్షా, ఆంధ్రావాలా అయిపోయాయి. తారక్ ఫ్యాన్స్ దీనికి ఏ మాత్రం ఆసక్తి చూపిస్తారో వెయిట్ చేయాలి. రజనీకాంత్ ముత్తు, శివాజీలను సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ చివర్లో రవితేజ వెంకీ వస్తోంది. ఆఖరికి ధనుష్ డబ్బింగ్ మూవీ సింహ పుత్రుడుని సైతం రిలీజ్ చేసేందుకు తెగబడుతున్నారంటే ఈ ట్రెండ్ ని ఎంత అతిగా అంచనా వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయినా కొంచెం గ్యాప్ ఇచ్చి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఏదో వరద వచ్చినట్టు ఇన్నేసి వదులుతుంటే మొహం మొత్తక అంతకన్నా ఏమవుతుంది.
This post was last modified on November 3, 2023 11:12 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…