ఒకప్పుడు కల్ట్ ఫిలిం మేకర్ గా శివ, రంగీలా, సత్య, గాయం లాంటి క్లాసిక్స్ ఇచ్చిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు దర్శకుడిగా ఏ స్థాయికి దిగిపోయి అడల్ట్ కంటెంట్ తో పాటు పొలిటికల్ అజెండా ఉన్న సినిమాలు ఎలా తీస్తున్నారో అభిమానులతో సహా అందరూ చూస్తూనే ఉన్నారు. నవ్విపోదురుగాక నాకేంటి అన్న తరహా వర్మ వ్యవహార శైలి ఆయన ఇష్టమే అయినా ఎందరో ఫిలిం మేకర్స్ కి స్ఫూర్తినిచ్చి ఇలా దిగిపోవడం బాధ కలిగించేదే. తాజాగా ఆయన తీసిన వ్యూహంకి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రివైజింగ్ కమిటికీ సిఫార్స్ చేస్తూ నిర్మాతకు అఫీషియల్ గా లెటర్ వచ్చింది.
వర్మ మాత్రం ఈ సీరియస్ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. సెన్సార్ ని గౌరవిస్తామని చెబుతూనే అరచేత్తో సూర్యుడిని ఆపలేరు అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ డైలాగులు వల్లెవేస్తున్నారు. వ్యూహం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తీసిన సినిమాగా పేర్కొంటూ టిడిపి తరఫున లోకేష్ ఫిర్యాదు చేయడం వల్ల ఈ వ్యవహారం మలుపు తిరిగింది. వర్మ ఇది ఎవరిని ఉద్దేశించి తీయలేదని చెబుతూ వితండవాదం చేస్తున్నారు కానీ ట్రైలర్ చూస్తే చిన్న పిల్లాడైనా సరే జగన్ ఎవరో బాబు ఎవరో పవన్ ఎవరో గుర్తుపట్టేంత సులభంగా మేకప్పులతో సహా చాలా స్పష్టంగా చూపించారు.
అలాంటప్పుడు నాకెలాంటి దురుద్దేశం లేదని, నిజాలు మాత్రమే చూపించానని చెప్పడం జోకే. అలా అయితే జగన్ మీదున్న కేసులు, 16 నెలలు జైలులో ఉండి బెయిలు మీద బయటికి రావడం, పాలనలోకి వచ్చాక జరిగిన అక్రమాలు ఇవి కూడా చూపిస్తారాని తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలు అడిగితే మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళ రీతిలో సమాధానం చెబుతారు. ఒకవేళ వ్యూహంకు థియేటర్ రిలీజ్ సాధ్యం కాకపోతే చేతిలో ఉన్న ఒకే అస్త్రం ఓటిటి. ఎవరూ ఆపలేరు అనేదానికి మీనింగ్ బహుశా అదే అయ్యుండొచ్చు. వేచి చూద్దాం.
This post was last modified on November 3, 2023 12:10 pm
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…