Movie News

దీపావ‌ళిపై ఎందుకింత చిన్న‌చూపు?

టాలీవుడ్లో విప‌రీత‌మైన డిమాండ్ ఉన్న సీజ‌న్ అంటే.. సంక్రాంతినే. ఆ త‌ర్వాతి స్థానంలో నిలిచే షార్ట్ సీజ‌న్ అంటే.. ద‌స‌రానే. ఇక లాంగ్ సీజ‌న్ల‌లో మంచి డిమాండ్ ఉన్న‌ది వేస‌విలోనే. కానీ దీపావ‌ళి పండుగ మీద మాత్రం టాలీవుడ్‌కు ఎప్పుడూ చిన్న‌చూపే. ముందు నుంచి ఈ ట్రెండ్ న‌డుస్తోంది. దీపావ‌ళికి ఇటు త‌మిళంలో, అటు హిందీలో ప్ర‌తి సంవ‌త్స‌రం భారీ చిత్రాలు రిలీజ‌వుతుంటాయి. చాలా ముందుగానే బెర్తులు బుక్ అయిపోతుంటాయి.

ఈసారి కూడా అందుకు భిన్న‌మేమీ కాదు. హిందీలో స‌ల్మాన్ ఖాన్ భారీ సినిమా టైగ‌ర్-3 ఆ పండ‌క్కే రాబోతోంది. ఇక త‌మిళంలో జ‌పాన్, జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్ లాంటి క్రేజీ మూవీస్ రాబోతున్నాయి దీపావ‌ళికి. కానీ తెలుగు నుంచి ఈ పండ‌క్కి చెప్పుకోద‌గ్గ సినిమాలే లేవు. ఉన్న ఒక్క సినిమా కూడా రేసు నుంచి త‌ప్పుకుంది. వైష్ణ‌వ్ తేజ్ మూవీ ఆదికేశ‌వ‌ను దీపావ‌ళికే షెడ్యూల్ చేసిన సంగ‌తి తెలిసిందే.

కానీ ప్ర‌పంచ‌క‌ప్ ఫీవ‌ర్‌ను కార‌ణంగా చూపించి ఆ సినిమాను 24కు వాయిదా వేశారు. రామ్ గోపాల్ వ‌ర్మ పొలిటిక‌ల్ మూవీ వ్యూహం న‌వంబ‌రు 10న రావాల్సి ఉంది కానీ.. దాని మీద స‌గ‌టు సినీ ప్రియుల‌కు ఏమాత్రం ఆస‌క్తి లేదు. ఆ సినిమా రిలీజ్ నామ‌మాత్ర‌మే కావ‌చ్చు. ఇక వేరే చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ దీపావ‌ళికి రావ‌ట్లేదు.

ఇలాంటి పెద్ద పండుగ వీకెండ్‌ను మ‌న నిర్మాత‌లు ఎందుకు లైట్ తీసుకుంటారో అర్థం కాని విష‌యం. ఈసారి అంటే ప్ర‌పంచ‌క‌ప్‌, ఎన్నిక‌లు వంటి కార‌ణాలు చెబుతున్నారు కానీ.. ఎప్పుడూ కూడా దీపావ‌ళి అంటే మ‌న వాళ్ల‌కు చిన్న‌చూపే. తెలుగులో చెప్పుకోద‌గ్గ రిలీజ్‌లు లేక‌పోవ‌డంతో డ‌బ్బింగ్ సినిమాల‌దే హ‌వా కాబోతోంది. థియేట‌ర్ల‌న్నింటినీ వాటితోనే నింపేయ‌బోతున్నారు. ఇది టాలీవుడ్‌కు నిరాశ క‌లిగించే విష‌య‌మే.

This post was last modified on November 2, 2023 10:12 pm

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

5 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

7 hours ago