Movie News

ఈటీవీ విన్ నుంచి ఎట్ట‌కేల‌కు..

ఇప్పుడంతా ఓటీటీల‌దే హ‌వా. క‌రోనా టైం నుంచి ఈ ఫ్లాట్ ఫామ్స్ ఎలా ఆధిప‌త్యాన్ని చ‌లాయిస్తున్నాయో తెలిసిందే. థియేట‌ర్ల‌కు స‌వాలు విసిరే స్థాయిలో బోలెడ‌న్ని ఓటీటీలు వ‌చ్చాయి. భారీగా  పెట్టుబ‌డి పెట్టి ఒరిజిన‌ల్ కంటెంట్ అందిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఈ కోవ‌లో కొంచెం లేటుగా రేసులోకి వ‌చ్చిన ఓటీటీ.. ఈటీవీ విన్.

ఉషా కిర‌ణ్ మూవీస్ ద‌గ్గ‌రున్న సినిమాలు, ఇత‌ర కంటెంట్‌తో కొన్నేళ్లు ఉచితంగానే అన్నీ చూసే అవ‌కాశం క‌ల్పించిన ఈటీవీ విన్.. ఈ మ‌ధ్యే పెయిడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ మోడ్‌లోకి మారింది. ఒరిజిన‌ల్స్ రూపొందిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవాల‌ని చూస్తోంది. ఐతే ఈటీవీ విన్ నుంచి ఇప్ప‌టిదాకా వ‌చ్చిన సినిమాలు, సిరీస్‌లు ఏవీ అంత ట్రెండీగా అనిపించ‌లేదు. ఆడియ‌న్స్‌ను పెద్ద‌గా అట్రాక్ట్ చేయ‌లేదు. కృష్ణారామా, దిల్ సే స‌హా ఇందులో వ‌చ్చిన‌ ఒరిజిన‌ల్స్ అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి.

ఐతే ఈటీవీ విన్ వాళ్లు ఎట్ట‌కేల‌కు మంచి కంటెంట్ ఉన్న సిరీస్‌తో వ‌స్తున్నట్లు క‌నిపిస్తోంది. 90s-ఎ మిడిల్ క్లాస్ బ‌యోపిక్ పేరుతో కొత్త సిరీస్ రూపొందించింది ఈటీవీ విన్. ప్ర‌స్తుతం బిగ్ బాస్ షోలో మంచి పాలోయింగ్‌తో సాగిపోతున్న శివాజీ ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. తొలిప్రేమలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెల్లెలిగా న‌టించిన వాసుకి ఇందులో శివాజీకి జోడీగా న‌టించింది. సోష‌ల్ మీడియాలో మీమ్ వీడియోల‌తో పాపుల‌ర్ అయిన మౌళి ఇందులో శివాజీ కొడుకుగా న‌టించాడు.

సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ చేతుల మీదుగా రిలీజైన ఈ సిరీస్ టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. 90ల నాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబిస్తూనే ఆహ్లాద‌క‌ర‌మైన వినోదంతో ఈ టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. ఈటీవీ విన్‌లో ఇప్ప‌టిదాకా వ‌చ్చిన సిరీస్‌ల‌న్నింటితో పోలిస్తే ఇది ఎంగేజింగ్‌గా అనిపిస్తోంది. ఓ మ‌ధ్య త‌ర‌గతి కుటుంబంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల చుట్టూ న‌డిచే ఈ సిరీస్‌ను ఆదిత్య హాస‌న్ రూపొందించాడు. వ‌చ్చే జ‌న‌వ‌రి 5 నుంచి ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది.

This post was last modified on November 2, 2023 10:15 pm

Share

Recent Posts

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

29 minutes ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

29 minutes ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

4 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

4 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

4 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

7 hours ago