యూత్ హీరోల సినిమాలకు విడుదల తేదీ సెట్ చేసుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఒకపక్క సలార్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ మాట మీద ఉండలేక డేట్లు మారుస్తూ ఇతరులను ప్రభావితం చేస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫలానా తేదీకి అందరూ కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ, సుహాస్ ఇద్దరికీ ఇదే పెద్ద ఇబ్బందిగా మారిపోయింది. బేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ నుంచి వస్తున్న చిత్రం గంగం గణేశా. టీజర్ వచ్చి వారాలు దాటేసింది. ముందు సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు కానీ పోటీ వల్ల వాయిదా వేస్తూ వచ్చారు.
సుహాస్ అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ కి క్రమంగా బజ్ పెరుగుతోంది. ఒక ప్లానింగ్ ప్రకారం టీమ్ చేస్తున్న ప్రమోషన్లు హెల్ప్ అవుతున్నాయి. పాత్ర కోసం ఏ మాత్రం మొహమాటపడకుండా సుహాస్ గుండు కొట్టించుకోవడం ఆల్రెడీ హాట్ టాపిక్ అయిపోయింది. మ్యూజిక్, విలేజ్ బ్యాక్ డ్రాప్ విజువల్స్, డిఫరెంట్ లవ్ స్టోరీ అనే ఫీలింగ్ మొత్తానికి అంచనాలైతే సృష్టించాయి. ఈ రెండు సినిమాలకు ఈ ఏడాది మొత్తం ఎక్కడా స్లాట్ కనిపించడం లేదు. పోటీలో దిగితే ఓపెనింగ్స్ తో పాటు థియేటర్ల సమస్య వస్తుంది. అందుకే వీలైనంత సోలోగా రావడం మంచి ఫలితం ఇస్తుంది.
ప్రస్తుతం వీటి నిర్మాతలు సరైన డేట్ కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. గంగం గణేశా టీమ్ సైలెంట్ అయిపోయింది కానీ అంబాజీపేట బృందం మాత్రం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తమ టాపిక్ వచ్చేలా ఏదో ఒక ఈవెంట్ చేస్తూనే ఉన్నారు. విడుదల తేదీ కనీసం రెండు మూడు వారాలు ముందుగా ఫిక్స్ అయితే తప్ప పబ్లిసిటీకి సరైన సమయం దొరకడం లేదు. పోనీ వేచి చూద్దామా అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకా ఛాన్స్ దొరకదు. సో ఏదో ఒకటి వీలైనంత త్వరగా డిసైడ్ చేసుకుంటే తప్ప ప్రమోషన్ ఎలా చేయాలనే దాని మీద క్లారిటీ రాదు. నవంబర్ చివరి వారంలో ఒకటి రావొచ్చు.
This post was last modified on November 1, 2023 11:07 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…