పెళ్ళిచూపులు సినిమాతో తరుణ్ భాస్కర్ ఏడేళ్ల కిందట ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. సరికొత్త కథాకథనాలతో ప్రేక్షకులకు ఒక భిన్నమైన అనుభూతిని పంచాడు తరుణ్ ఆ చిత్రంతో. ఈ సినిమాతో తరుణ్ మీద భారీగా అంచనాలు నెలకొనగా.. సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ తనతో పని చేయడానికి ఆసక్తి చూపించాడు. వీళ్లిద్దరి కలయికలో గుర్రపు రేసుల నేపథ్యంలో ఓ సినిమా రాబోతోందని, సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని ప్రచారం జరిగింది.
కానీ ఏళ్లు గడిచాయి. ఎంతకీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. మధ్యలో తరుణ్.. ఈ నగరానికి ఏమైంది సినిమా చేశాడు. ఇప్పుడు కీడాకోలాతో రాబోతున్నాడు. దీని తర్వాత అతను విజయ్ దేవరకొండతో జట్టు కట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి వెంకీతో సినిమా సంగతి ఏమైందో తెలియదు. కీడాకోలా సినిమా ప్రమోషన్లలో భాగంగా వెంకీ సినిమా గురించి అడిగితే.. తరుణ్ భాస్కర్ తెర వెనుక సంగతులు చెప్పాడు.
ఒక కొత్త ఐడియాతో ఆ కథ రాశానని.. కాకపోతే దాని ముగింపు, మరికొన్ని విషయాల్లో తనకు సంతృప్తి కలగలేదని చెప్పాడు. కానీ నిర్మాత సురేష్ బాబుకు ఆ స్క్రిప్టు నచ్చి సినిమా తీయడానికి రెడీ అయ్యారని తరుణ్ తెలిపాడు. కానీ తనకే సంతృప్తి లేక ఆ సినిమాను ఆపేశానన్నాడు. ఐతే తర్వాత దాని మీద పని చేసి కథను ఒక కొలిక్కి తెచ్చానని.. ఇప్పుడు ఆ సినిమా చేయడానికి రెడీగానే ఉన్నానని చెప్పాడు.
కీడాకోలా రిజల్ట్‌ను బట్టి త్వరలో వెంకీతో ఆ కథను తీస్తానని చెప్పాడు తరుణ్. ఇక కీడాకోలా సినిమా గురించి చెబుతూ.. ఇప్పటిదాకా తీసిన మూడు చిత్రాల్లో తాను ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నది కీడాకోలా విషయంలోనే అని తరుణ్ తెలిపాడు. ఈ సినిమాను 2 గంటల 20 నిమిషాల నిడివితో తీశానని.. కానీ క్రైమ కామెడీలు క్రిస్ప్‌గా ఉంటే బాగుంటుందని.. తనే ఓ పావుగంట ఎడిట్ చేశానని తరుణ్ చెప్పాడు.
This post was last modified on November 1, 2023 1:08 am
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…