తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌కు తెలుగులో బంపర్ క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ‘ఖైదీ’ మూవీనే. కార్తి హీరోగా అతను రూపొందించిన ఈ చిత్రం తమిళంలోనే కాక తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. విక్రమ్‌లో ఖెదీ సినిమాకు కనెక్షన్ పెట్టడంతో ఈ సినిమా క్రేజ్ ఇంకా పెరిగింది. ఖైదీని లోకేష్ కెరీర్లో బెస్ట్ మూవీగా చూస్తారు అభిమానులు.
దానికి సీక్వెల్ తీస్తానని లోకేష్ ఎప్పట్నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విశేషాలే పంచుకున్నాడు. లియో తర్వాత రజినీకాంత్‌తో సినిమా చేయబోతున్న లోకేష్.. దాని తర్వాత వెంటనే ఖైదీ-2 తీస్తానని వెల్లడించాడు. ఢిల్లీ గతంతో పాటు, వర్తమానానికి ముడి పెడుతూ ఈ కథ ఉంటుందని చెప్పాడు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్‌తో ఖైదీకి కచ్చితంగా కనెక్షన్ ఉంటుందని చెప్పిన లోకేష్.. విక్రమ్‌లో విలన్‌గా కనిపించిన సంతానం చనిపోయాడు కాబట్టి డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంకొకరి చేతుల్లోకి వెళ్తుందని.. ఆ విలన్ ఎవరు అనేది సర్ప్రైజ్ అని లోకేష్ తెలిపాడు. ఖైదీ-2లో అనేక ఆశ్చర్యకర, కొత్త పాత్రలు ఉంటాయని.. ఆ సినిమా చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని లోకేష్ తెలిపాడు.
లియో పాత్ర ఎల్‌సీయూలో హీరోనా విలనా అన్నది కూడా ఇప్పుడు చెప్పనని.. తర్వాత ప్రేక్షకులు తెలుసుకుంటారని చెప్పాడు. ఖైదీ-2 తర్వాత విక్రమ్-2, లియో-2 సినిమాలు కూడా చేస్తానని.. వీటితో పాటు రోలెక్స్ మీద ప్రత్యేకంగా ఓ సినిమా ఉంటుందని అతనన్నాడు. లియో సినిమాకు నెగెటివ్ టాక్ రావడంపై లోకేష్ స్పందిస్తూ.. దీనిపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారన్నాడు.
This post was last modified on November 1, 2023 1:01 am
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…