థియేటర్ సినిమాలు చేస్తున్నంత హడావిడి ఈ మధ్య ఓటిటి రిలీజుల్లో కనిపించడం లేదు. అందుకే డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కాస్తంత చప్పగానే ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ మాత్రం వారానికి ఖచ్చితంగా ఒక సౌత్ మూవీ అందులోనూ తెలుగుది ఉండేలా ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టే మంచి స్పందన దక్కించుకుంటోంది. అయితే ఈ వారం మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఎంజాయ్ చేయాలనుకునే అభిమానులకు చాలా కానుకలు రాబోతున్నాయి. నవంబర్ 2 షారుఖ్ ఖాన్ పుట్టినరోజుని పురస్కరించుకుని ‘జవాన్’ని అన్ని భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇవాళ లేదా రేపు ప్రకటన రావొచ్చు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు బోయపాటి శీను కాంబోలో రూపొందిన ‘స్కంద’ కూడా ఇదే రోజు హాట్ స్టార్ లో కనువిందు చేయనుంది. ఫ్లాప్ టాక్ రావడంతో బిగ్ స్క్రీన్ మీద మిస్ చేసుకున్న వాళ్ళు బోలెడు ఉండటంతో భారీ వ్యూస్ దక్కే అవకాశాలున్నాయి. పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్ కిల్లర్ గా హిట్టు కొట్టిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘మ్యాడ్’ మరుసటి రోజు మూడో తేదీ నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షం కానుంది. సోషల్ మీడియా ప్రశంసలు దక్కించుకున్న ‘మంత్ అఫ్ మధు’ని ఆహా సొంతం చేసుకుని ఇదే రోజు రిలీజ్ చేయబోతున్నట్టు ఇందాక అధికారికంగా ప్రకటించింది.
ఇవి కాకుండా ఇతరత్రా వెబ్ సిరీస్ లు వేరే ఉన్నాయి. ఒకపక్క థియేటర్ సినిమాలు పోటీ పడుతున్న టైంలో ఇలా డిజిటల్ లోనూ ఇంత తాకిడి ఉండటం ఎన్నో వారాల తర్వాత జరుగుతోంది. కరోనా టైంలో దక్కిన విపరీత ఆధారణ వల్ల ఇబ్బడిముబ్బడిగా సినిమాలను కోట్లు పెట్టి కొన్న ఓటిటి కంపెనీలు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. పెద్ద హీరోల వాటికి ఇబ్బంది లేదు కానీ మీడియం బడ్జెట్ నిర్మాతలకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ మధ్య స్మార్ట్ స్క్రీన్ మీద కొత్త సినిమాల దూకుడు తగ్గిందని టాక్. ఏదైతేనేం మొత్తానికి ఈ వారం ఎంటర్ టైన్మెంట్ లవర్స్ కి పండగే.
This post was last modified on October 31, 2023 12:29 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…