ఈ ఏడాది టాలీవుడ్ టాప్ బ్లాక్ బస్టర్స్ లో చోటు సంపాదించుకున్న బేబీ హిందీ రీమేక్ కాబోతోందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు సాయి రాజేషే బాలీవుడ్ వెర్షన్ ని హ్యాండిల్ చేయబోతున్నట్టు తెలిసింది. సీనియర్ హీరో బాబీ డియోల్ కొడుకు ఆర్యమాన్ ని పరిచయం చేసేందుకు ఈ ప్రాజెక్టుని ఎంచుకున్నట్టు ముంబై అప్డేట్. సరే వినడానికి బాగానే ఉంది కానీ బేబీ లాంటి బోల్డ్ కంటెంట్ లు నార్త్ జనాలకు కొత్త కాదు. వాళ్ళకివి షాకింగ్ గానూ అనిపించవు. ఇలాంటివి కరణ్ జోహార్ జమానా నుంచి వెబ్ సిరీస్ ల దాకా ఎన్ని చూశారో లెక్క బెట్టడం కష్టం. ఇక్కడ ఇంకో కోణం ఉంది.
మన రీమేకులు ఈ మధ్య అక్కడ వర్కౌట్ కావడం లేదు. ఆరెక్స్ 100 ఇక్కడ చేసిన సెన్సేషన్ కనీసం పావు వంతు కూడా ఉత్తరాదిలో రిపీట్ కానివ్వలేదు. జెర్సీని గౌతమ్ తిన్ననూరే షాహిద్ కపూర్ లాంటి స్టార్ హీరోతో తీస్తే కనీసం బ్రేక్ ఈవెన్ లో సగం రాలేదు. రాక్షసుడుని అక్షయ్ కుమార్ చేసినా లాభం లేకపోయింది. అల వైకుంఠపురములో, గద్దలకొండ గణేష్, ఎంసిఏ , హిట్ ది ఫస్ట్ కేస్ ఇవన్నీ ఫెయిల్యూర్స్ కి కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్టార్ క్యాస్టింగ్ తో తీసినవే. ఓటిటి వల్ల ఒక భాషలో హిట్ అయినది చాలా త్వరగా జనాలకు చేరిపోతోంది. అందుకే మళ్ళీ చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
ఇప్పుడు సాయిరాజేష్ పెద్ద సవాల్ నే ఎదురు కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బేబీలో కంటెంట్ మన జనాలకు కనెక్ట్ అవ్వడానికి బోలెడు కారణాలున్నాయి. మన అభిరుచులు, వాతావరణానికి తగ్గట్టు నిబ్బా నిబ్బి లవ్ స్టోరీని బోల్డ్ గా తెరకెక్కించిన విధానం కాసుల వర్షం కురిపించింది. ఎప్పుడో ఆషిక్ బనాయా ఆప్నే నుంచి ఇలాంటి కథలకు అలవాటు పడిన హిందీ ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభంగా ఉండదు. చూస్తుంటే బేబీ దర్శకుడు సందీప్ వంగాని స్ఫూర్తిగా తీసుకున్నట్టు ఉంది. అర్జున్ రెడ్డి అక్కడ కబీర్ సింగ్ గా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన వైనం ఇన్స్ పిరేషన్ అయిందేమో.
This post was last modified on October 31, 2023 11:21 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…