గత ఏడాది మాచర్ల నియోజకవర్గం తర్వాత నితిన్ ని చూసి చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ గా రాబోతున్నాడు. స్టార్ రైటర్ గా ఎన్నో బ్లాక్ బస్టర్లకు పని చేసి అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ డైరెక్షన్ లో రాబోతున్న రెండో మూవీ ఇది. నితిన్ స్వంత బ్యానర్ లోనే ఇది రూపొందుతోంది. టాలీవుడ్ టాప్ డిమాండ్ ఉన్న శ్రీలీల హీరోయిన్ కావడంతో పాటు మ్యూజికల్ గా హరీష్ జైరాజ్ తోడవ్వడంతో ఆకర్షణలు కూడా ఎక్స్ ట్రా అయ్యాయి. నవంబర్ 8 విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ టీజర్ ఇందాకా రిలీజ్ చేశారు.
సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా పని చేసే ఓ కుర్రాడు(నితిన్). ఆ మాత్రం దానికే పెద్ద హీరోలా ఫీలవుతూ ఉంటాడు. తండ్రి ఎంత తిట్టినా ఏదీ చెవికెక్కదు. ఎవరైనా దేంట్లో నటించావంటే బాహుబలి దండాలయ్యా పాట జనాల మందలో నాలుగో లైన్ మధ్యలో ఉంటానని చూసుకోమని గర్వంగా చెబుతాడు. గుంపులో గోవిందా అయినా సరే గ్లామర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే ఇతగాడికి ఓ లవర్(శ్రీలీల) కూడా ఉంటుంది. అంత హ్యాపీస్ లాగా సాగిపోతున్న ఇతని జీవితంలో ఎలాంటి అలజడులు, విలన్లు లేరా అంటే ప్రస్తుతానికి వాటిని రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు.
అప్పుడెప్పుడో ఖడ్గంలో రవితేజని జూనియర్ ఆర్టిస్ట్ గా చూశాక అంతకు మించిన ఫుల్ లెన్త్ రోల్ లో నితిన్ కొత్తగా, వెరైటీగా కనిపిస్తున్నాడు. వక్కంతం మార్కు తింగరితనం ఇందులోనూ కనిపిస్తోంది. నిమిషంన్నరే కాబట్టి ఎక్కువ జడ్జ్ చేయడానికి ఛాన్స్ లేకుండా తెలివిగా కట్ చేశారు. రెగ్యులర్ ట్రెండ్ ని ఫాలో కాకుండా మెయిన్ స్టోరీకి సంబంధించిన క్లూస్ ఇవ్వకుండా మేనేజ్ చేశారు. హరీష్ జైరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వేల్యూస్ బాగానే కనిపిస్తున్నాయి. రావు రమేష్, సంపత్ రాజ్ తప్ప క్యాస్టింగ్ ని పెద్దగా రివీల్ చేయలేదు. ట్రైలర్ కోసం చాలానే దాచి పెట్టారు. వేచి చూడాలి మరి
This post was last modified on October 30, 2023 8:42 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…