ఒకప్పుడు ఏదైనా పెద్ద హీరో సినిమా యాభై రోజులు దాటాక కలెక్షన్లు తగ్గాయనిపిస్తే ఎడిటింగ్ లో పక్కనపెట్టిన పాటలు లేదా సీన్లు జోడించి మళ్ళీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్లాన్ వేసేవాళ్ళు. కానీ తర్వాత కాలం మారిపోయింది. రెండు వారాలు గట్టిగా ఆడితే చాలు దేవుడా అని మొక్కుకునే పరిస్థితులు వచ్చాయి. ముందులా ఇప్పుడు హోమ్ వీడియోలు, డివిడిలు లేవు. వాటిలో ఆ ఎక్స్ ట్రా ఫుటేజ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కొంతమంది డిలీటెడ్ కంటెంట్ పేరుతో యూట్యూబ్ లో వదులుతున్నారు కానీ వాటిలో అధిక శాతం సన్నివేశాలు ఉంటున్నాయి. సరే ఇక విషయానికి వద్దాం.
వచ్చే వారం నవంబర్ 4న రీ రిలీజ్ కాబోతున్న శంకర్ దాదా ఎంబిబిఎస్ కోసం మెగా ఫాన్స్ బాగానే ఎదురు చూస్తున్నట్టు బుకింగ్స్ ని బట్టి అర్థమవుతోంది. 2004లో ఇది విడుదలైనప్పుడు అర్ధ శతదినోత్సవం తర్వాత సందెపొద్దుల తాండే నీ జిమ్మదియ్య పాటను జత చేస్తే మళ్ళీ కలెక్షన్లు కాసింత ఎక్కువొచ్చాయి. చిరంజీవి, సోనాలి బెంద్రేతో పాటు దేవిశ్రీ ప్రసాద్ కూడా అలా తళుక్కున మెరుస్తాడు. కానీ తర్వాత విసిడి, శాటిలైట్ ఛానల్స్ ఇది లేదు. జెమినిలో ప్రసారం చేసినా, ఫుల్ మూవీ యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నా ఎక్కడా దీని వీడియో జాడ లేదు. ఇన్నేళ్ల తర్వాత చూసే ఛాన్స్ దొరికింది.
ఈ సాంగ్ ని ఇప్పుడు థియేటర్లలో4Kతో చూడమని నిర్మాతలు ఊరిస్తున్నారు. మున్నాభాయ్ ఏంబిబిఎస్ కు రీమేక్ గా రూపొందిన శంకర్ దాదా కామెడీ మరోసారి ఎంజాయ్ చేసేందుకు మూవీ లవర్స్ కూడా ఆసక్తిగానే ఉన్నారు. హుషారైన పాటలు, చిరు టైమింగ్, దేవి సాంగ్స్ తో కంప్లీట్ ఎంటర్ టైనర్ గా దీనికి అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎలాగూ వచ్చే వారం కీడా కోలా, మా ఊరి పొలిమేర 2 తప్ప పెద్దగా చెప్పుకునే సినిమాలు లేవు కాబట్టి వసూళ్లు బాగుంటాయని ఆశిస్తున్నారు. రీ రిలీజ్ ట్రెండ్ బాగా నెమ్మదించిన టైంలో వస్తున్న మెగాదాదాకొచ్చే స్పందనను బట్టి దగ్గర్లో మరిన్ని వచ్చే అవకాశాలున్నాయి.
This post was last modified on October 30, 2023 6:45 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…