ప్రపంచ కప్ లో ఇండియా మ్యాచులు ఉన్నప్పుడు సహజంగానే థియేటర్లకు వచ్చే జనాల శాతం తక్కువగా ఉంటుంది. కానీ భగవంత్ కేసరి దానికి మినహాయింపుగా నిలిచింది. నిన్న దాదాపు అన్ని చోట్ల మంచి వసూళ్లు నమోదు కావడం బయ్యర్లను ఆనందంలో ముంచెత్తింది. పదకొండు రోజులు పూర్తి చేసుకున్న బాలయ్య మూవీ ఇప్పటిదాకా 65 కోట్లకు పైగా షేర్ సాధించినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఇంకో నాలుగు కోట్లు వస్తే సాధికారికంగా లాభాల్లోకి అడుగు పెట్టేస్తుంది. ఎంత సెలవు రోజు అయినా కేసరికి నమోదైన ఆక్యుపెన్సీల్లో లియో, టైగర్ నాగేశ్వరరావు సగం కూడా సాధించలేదు.
నైజామ్, సీడెడ్, ఉత్తరాంధ్ర, గుంటూరు, కర్ణాటక, ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ పూర్తయిపోగా నెల్లూరు, కృష్ణా ఆ లాంచనానికి అతి దగ్గరలో ఉన్నాయి. గోదావరి జిల్లాలు 70 శాతం చేరువలో కొంత వెనుకబడి ఉన్నాయి. ఫైనల్ రన్ కి ఇంకా టైం ఉంది కాబట్టి అన్ని చోట్ల ప్రాఫిట్ వెంచర్ గా నిలవబోతున్నాడు కేసరి. మొన్న శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం, వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్ కనీస స్థాయిలో ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించడంలో విఫలం కావడంతో భగవంత్ హవా మళ్ళీ కొనసాగింది. చాలా చోట్ల మధ్యాన్నం నుంచి ఈవెంగ్ షోల దాకా హౌస్ ఫుల్స్ పడ్డాయి.
దీంతో బాలయ్యకు సక్సెస్ ఫుల్ గా మూడు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ దక్కాయి. సీనియర్ హీరోలలో ఎవరికీ గత కొన్నేళ్లలో ఈ ఫీట్ సాధ్యం కాలేదు. శ్రీలీల పాత్ర, తమన్ నేపధ్య సంగీతం, మాస్ ఎపిసోడ్స్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సన్నివేశం కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ వారం కీడా కోలా, మా ఊరి పొలిమేర 2 రిలీజవుతున్నాయి కానీ క్యాస్టింగ్ పరంగా చూసుకుంటే టాక్ మీద ఆధారపడాలి తప్పించి అంతగా బజ్ లేదు. సో వీటికొచ్చే రెస్పాన్స్ ని బట్టి భగవంత్ కేసరి మూడో వారం హవా కొనసాగుతుంది. క్లోజింగ్ ఫిగర్స్ వచ్చాక లాభం ఎంత వచ్చిందనేది తేలుతుంది. ఇంకో పది రోజులు ఎదురు చూడాలి.
This post was last modified on October 30, 2023 10:29 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…