ఒక ఓటిటి సినిమాకు కొనసాగింపుని థియేటర్లో తీసుకురావాలనే ఆలోచనే పెద్ద రిస్క్. అలాంటిది జనంలో దాన్ని చూడొచ్చనే ఆసక్తి రేపడం ఇంకో ఛాలెంజ్. రెండేళ్ల క్రితం డిస్నీ హాట్ స్టార్ లో వచ్చిన మా ఊరి పొలిమేర స్మార్ట్ స్క్రీన్ పై పెద్ద సక్సెస్ అందుకుంది. ఓ చిన్న గ్రామంలో చేతబడుల చుట్టూ నడిపించిన కాన్సెప్ట్ ప్రేక్షకులను భయపెట్టి మెప్పించింది. దెయ్యాల కథ కాకపోయినా థ్రిల్, సస్పెన్స్ ని మైంటైన్ చేస్తూ దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తీర్చిదిద్దిన తీరు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఆ స్పందనే పెద్ద తెరపై దీన్ని చూపించాలన్న కాంక్షను రగిలించి పార్ట్ 2 తీసేలా ప్రేరేపించింది.
ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ స్టార్ క్యాస్టింగ్ లేని ఈ చిన్న బడ్జెట్ మూవీకి క్రమంగా బజ్ పెరగడం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. నవంబర్ 3న తరుణ్ భాస్కర్ కీడా కోలా ఒకటే చెప్పుకోదగ్గ రిలీజ్. దానికీ భీభత్సమైన హైప్ లేదు కానీ టాక్ తో ఒక్కసారిగా స్పీడ్ అందుకుంటుందని టీమ్ నమ్మకం. సో మంచి అవకాశం ఉండటంతో మా ఊరి పొలిమేర 2 వరస ప్రమోషన్లతో తన గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకునేలా చేస్తోంది. ఇది ఎంత బాగా పని చేసినంటే ట్రైలర్ వచ్చిన వెంటనే మొదటి భాగం హాట్ స్టార్ లో హఠాత్తుగా ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది. అంత ప్రభావం చూపడం విశేషమే.
ప్రధాన పాత్ర పోషించిన సత్యం రాజేష్ మొత్తం అయిదు భాగాలకు సరిపడా మా ఊరి పొలిమేర కథ ఉందని చెబుతున్నాడు. సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే హారర్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉన్నట్టున్నాయి. నిర్మాత బన్నీ వాస్ ఈ బృందానికి అండగా ఉండటం పబ్లిసిటీ ప్లస్ పంపిణి పరంగా చాలా హెల్ప్ అవుతోంది. కీడా కోలాకు సురేష్ అండదండలు, పొలిమేరకు గీతా ఆర్ట్స్ 2 అభయం ఇలా చిన్న సినిమాల మధ్య పెద్ద పోటీని సృష్టించి పెట్టాయి. ఒకవేళ టాక్ కనక బాగా వస్తే విరూపాక్ష, కాంతార రేంజ్ లో నిలబడుతుందని పొలిమేర సభ్యులు బలంగా చెబుతున్నారు. మరి అంచనాలు నిలబెట్టుకోవడమే తరువాయి.
This post was last modified on October 29, 2023 10:31 pm
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…
ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…