Movie News

చల్లారని సలార్ వాయిదా మంటలు

ఒక ప్యాన్ ఇండియా మూవీ విడుదల తేదీకి కట్టుబడకుండా పదే పదే మార్చుకుంటూ పోతే దాని తాలూకు పరిణామాలు ఇతర సినిమాల మీద ఎంత తీవ్రంగా ఉంటాయో సలార్ మర్చిపోలేని ఉదాహరణగా నిలుస్తోంది. డిసెంబర్ 22ని లాక్ చేసుకున్నాక నెలల క్రితమే ఆ డేట్ కి రావాలనుకుని ఫిక్సైన హాయ్ నాన్న తప్పని పరిస్థితిలో మొదటివారానికి షిఫ్ట్ అయ్యింది. దీంతో ఆల్రెడీ ఆ స్లాట్ లో ఉన్న గ్యాంగ్స్ అఫ్ గోదావరితో పాటు ఆపరేషన్ వాలెంటైన్ కి చికొచ్చి పడింది. ఇవి చాలదన్నట్టు నితిన్ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ కూడా క్లాష్ కి సిద్ధపడటం పోటీలో మరింత వేడిని రాజేసింది. విశ్వక్ ని బరస్ట్ అయ్యేలా చేసింది.

ఇదంతా సలార్ వల్లేనని మళ్ళీ చెప్పనక్కర్లేదు. అంతకు ముందు సెప్టెంబర్ 28 వదిలేసినప్పుడు ఇదే సమస్య. బాగా ఎఫెక్ట్ అయ్యింది స్కందనే. వినాయకుడి పండగను టార్గెట్ చేసుకుని ప్లాన్ చేసుకున్న 15ని వద్దనుకుని ఇండస్ట్రీ పెద్దల సలహాతో సలార్ నో అన్న డేట్ ని తీసుకుంది. స్కంద హఠాత్తుగా నెలాఖరుకు రావడంతో ఆల్రెడీ అక్కడ ఉన్న పెదకాపు 1కి వేరే మార్గం లేక రామ్ తో తలపడాల్సి వచ్చింది. దీని వల్ల శ్రీకాంత్ అడ్డాల సినిమాకి పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. ఇవే కాదు చంద్రముఖి 2 కూడా దెబ్బ తింది. ఇంతా చేసి గణేశుడి పండగని మార్క్ ఆంటోనీకి వదిలేస్తే ఆ ఛాన్స్ నది వాడుకోలేదు.

ఈ లెక్కన సలార్ మంటలు ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తూ వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కథ ఇక్కడితో అయిపోలేదు. అవతల షారుఖ్ ఖాన్ డుంకీని లెక్క చేయకుండా సలార్ ని దింపడం పట్ల బాలీవుడ్ పెద్దలు గుర్రుగా ఉన్నారు. థియేటర్లను ఎక్కువ లాగేందుకు కార్పొరేట్ సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లతో ముంతనాలు మొదలుపెట్టారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సలార్ కు చెక్ పెట్టేందుకు పెద్ద స్కెచ్ రెడీ అవుతోందని ముంబై కథనాలు ఉటంకిస్తున్నాయి. ఒకవేళ సలార్ కనక ముందు చెప్పిన మాటకే కట్టుబడి ఉంటే ఇవాళ ఇన్ని పరిణామాలు జరిగేవి కాదు. ఈ మంటలు ఇంకెన్ని రోజులు మండుతాయో మరి. 

This post was last modified on October 29, 2023 3:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమెరికాలో భారత సంతతికి చెందిన కౌన్సిలర్‌పై గ్యాంబ్లింగ్ ఆరోపణలు!

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గ్యాంబ్లింగ్ మాఫియా…

9 minutes ago

‘స్పిరిట్’ ఎప్పుడు – ఎక్కడ – ఎలా

ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…

51 minutes ago

ఓహ్ బేబీ….ఇది రెండో నెంబర్ బ్రేకు

రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…

2 hours ago

సుప్రీం తీర్పు : గవర్నర్ ఆమోదం లేకుండానే… చట్టాలుగా 10 తమిళ బిల్లులు

తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…

3 hours ago

వైరల్ వీడియో: సూట్‌కేస్‌లో గర్ల్‌ఫ్రెండ్‌!

హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది.…

3 hours ago

ఉచితాల‌తో మ‌భ్య‌పెట్టాల‌ని చూశారు: వెంక‌య్య కామెంట్స్‌

మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి, బీజేపీ నాయ‌కుడు ముప్ప‌వ‌రపు వెంక‌య్య‌నాయుడు.. తాజాగా అటు తెలంగాణ‌, ఇటు ఏపీ నేత‌ల‌పై సెట‌ర్లు గుప్పించారు.…

4 hours ago