2024 సంక్రాంతి సినిమాల వ్యవహారం యమ రంజుగా మారింది. ఈ పండక్కి ఎప్పుడూ పోటీ మామూలే కానీ.. ఈసారి మరీ ఎక్కువగా ఉండేలా ఉంది. మూణ్నాలుగుకు మించి పేరున్న సినిమాలను రిలీజ్ చేయడం కష్టమని తెలిసినా.. ఈసారి ఏకంగా ఆరు సినిమాలు రేసులో ఉన్నాయి. ముందు డేట్ ఇచ్చినా.. తర్వాత రెండు మూడు సినిమాలు తప్పుకుంటాయిలే అనుకుంటే.. ఎవరికి వాళ్లు భీష్మించుకుని కూర్చున్నారు. మళ్లీ మళ్లీ సంక్రాంతి రిలీజ్ అని నొక్కి వక్కాణిస్తున్నారు. గత రెండు మూడు వారాల్లో ఒక్కో సినిమా మళ్లీ తమ చిత్రం సంక్రాంతికే వస్తుందని నొక్కి వక్కాణించడం చూశాం. గుంటూరు కారం, సైంధవ్, ఫ్యామిలీ స్టార్, హనుమాన్.. ఇలా గత కొన్ని రోజుల్లో సంక్రాంతి రిలీజ్‌ను మరోసారి ఖరారు చేస్తూ పోస్టర్లు వదలడమో.. ఇంకో రకమైన హింట్ ఇవ్వడమో చేశాయి.
తాజాగా ఈగల్ టీం సైతం ఇదే పని చేసింది. ఈగల్ ఆన్ లొకేషన్ వీడియో ఒకటి రిలీజ్ చేసి తమ చిత్రం సంక్రాంతికే వస్తుందని ధ్రువీకరించింది. ఈ మధ్య ఈగల్ టీం నుంచి ఏ అప్‌డేట్ లేకపోవడంతో సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందేమో అన్న అనుమానాలు కలిగాయి. కానీ తాజా వీడియోతో ఆ సందేహాలకు తెరదించింది. చిన్న సినిమా కదా హనుమాన్‌ను రేసులో తప్పిస్తారేమో అనుకుంటే ఇటీవలే ఆ టీం కూడా దసరా పోస్టర్‌తో సంక్రాంతి రిలీజ్‌ను కన్ఫమ్ చేసింది. కాబట్టి ప్రస్తుతానికి ఐదు సినిమాలు పక్కాగా సంక్రాంతికి రాబోతున్నట్లే.
ఇక ఇంతకుముందు సంక్రాంతి డేట్ ఇచ్చి, మళ్లీ కన్ఫమ్ చేయని సినిమా అంటే.. నా సామిరంగా మాత్రమే. అనౌన్స్‌మెంట్ రోజు సంక్రాంతి రిలీజ్ అన్న నాగ్.. సైలెంటుగా షూటింగ్ చేసుకుంటున్నాడు. తర్వాత ఏ అప్‌డేట్ ఇవ్వలేదు. అందరూ సంక్రాంతి దిశగా వేగంగా అడుగులు వేస్తూ ప్రకటనలు ఇస్తున్న నేపథ్యంలో ఇక నాగ్ కూడా ఇంకోసారి రిలీజ్ డేట్‌ను ధ్రువీకరిస్తే సంక్రాంతికి అరడజను సినిమాలను ఖాయం చేసుకోవచ్చు.
This post was last modified on October 29, 2023 7:07 am
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…
దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి శుక్రవారంతో 10 మాసాలు గడిచాయి. గత ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి సర్కారుకొలువు…
హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…