చిరంజీవి కెరీర్లోనే మొదటిసారి ఒక సినిమా రెండు భాగాలుగా రాబోతోందా అంటే ఏమో కావొచ్చంటున్నాయి మెగా కాంపౌండ్ వర్గాలు. వశిష్ఠ దర్శకత్వంలో పాట రికార్డింగ్ తో ఇటీవలే మొదలుపెట్టిన మెగా 156కి ఈ ప్రతిపాదన సీరియస్ గా ఉందట. యువి క్రియేషన్స్ దీని మీద సుమారు 200 కోట్ల బడ్జెట్ సిద్ధం చేసిందనే వార్త ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతమున్న మార్కెట్ పరిస్థితుల్లో అంత మొత్తం చిరు మీద అంటే రిస్కే. సైరా నరసింహారెడ్డికి అంత ఖర్చు కాకపోయినా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. అందుకే బిజినెస్ పరంగా టూ పార్ట్స్ అయితేనే సేఫ్ అంటున్నారట.
ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ ప్రస్తుతమిది చర్చల దశలో ఉంది. మెగాస్టార్ తో సహా ఫ్యామిలీ మొత్తం వరుణ్ తేజ్ పెళ్లి సందడిలో ఉంది. ఒకటో తేదీ ఇటలీలో జరిగే వేడుకతో మొదలుపెట్టి హైదరాబాద్ లో నిర్వహించబోయే రిసెప్షన్ పూర్తయ్యేదాకా వాళ్ళెవరూ సినిమా పనులు చూసుకోరు. అందుకే వశిష్ట చిరు ఫ్రీ అయ్యేలోపు ప్రతిపాదన సిద్ధం చేసి హీరో ముందు ఉంచుతారని తెలిసింది. కథలో అంత స్కోప్ ఉంది కాబట్టే ఈ ఆలోచన జరుగుతోందని, బలవంతంగా సబ్జెక్టుని పొడిగించే ఉద్దేశం ఎంత మాత్రం లేదని సన్నిహితులతో వశిష్ట అన్నట్టు ఇన్ సైడ్ టాక్.
నిజమైతే మంచిదే కానీ షూటింగ్ కి బోలెడు సమయం కేటాయించాల్సి ఉంటుంది. భోళా శంకర్ దెబ్బకు కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన సినిమాని పక్కనపెట్టేసిన చిరంజీవి కొత్త కమిట్ మెంట్లు ఎవరికీ ఇవ్వలేదు. విశ్వప్రయత్నాలు చేస్తున్న వాళ్లలో వివి వినాయక్ ఉన్నాడు కానీ ఓకే అయ్యేదాకా నమ్మకంగా చెప్పలేం. తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ ప్రాజెక్టుని ఇంకో నెలలో ప్రకటించే అవకాశం లేకపోలేదు. అది కూడా ఫైనల్ వెర్షన్ సంతృప్తికరంగా వస్తేనే. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న మెగా 156 జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత వస్తున్న చిరు ఫాంటసీ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
This post was last modified on October 28, 2023 4:31 pm
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…